ఏపీ తెలంగాణా బోర్డర్ లో హై టెన్షన్.. ఆ ర్యాలీకి నో పర్మిషన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తరువాత బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారని, కక్ష సాధింపు చర్యలో భాగంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికించారని టిడిపి నేతలు, చంద్రబాబు అభిమానులు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు . ఇక తాజాగా హైదరాబాదులో ఉండే ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగులు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. దీంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల హైదరాబాద్ టు రాజమండ్రి కి తలపెట్టిన ర్యాలీతో ఏపీ తెలంగాణ బోర్డర్ లో టెన్షన్ నెలకొంది. చంద్రబాబు అరెస్టు ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు భారీ కారు ర్యాలీకి ఐటి ఉద్యోగులు పిలుపునివ్వడంతో ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తమై జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ర్యాలీలకు, యాత్రలకు అనుమతి లేదని ఎట్టి పరిస్థితిలోనూ ర్యాలీని ఆంధ్రప్రదేశ్లోకి అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. ఏపీలోకి ప్రవేశిస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు విజయవాడ హైదరాబాద్ హైవే తో పాటు ఏపీలోకి వచ్చే అన్ని మార్గాలలోనూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
గరికపాడుతో పాటుగా తక్కెళ్ళపాడు అనుమంచిపల్లిలో కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి వారు ఎక్కడికి వెళుతున్నారు అన్న అంశాన్ని ఆరా తీసిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్ర సరిహద్దులలో టెన్షన్ చోటు చేసుకుంది.
మరోవైపు నేడు చంద్రబాబును రెండో రోజు ఏపీ సిఐడి అధికారులు విచారించనున్నారు. ఇదే సమయంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించాలని ఐటీ ఉద్యోగులు నిర్ణయించిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనలకు అనుమతి లేదని ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications