టెన్షన్:ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి...ఏవోబీని జల్లెడ పడుతున్న బలగాలు

విశాఖపట్నం:మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ దాడితో తమ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసిన మావోల పట్ల ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పోలీసులు ఏవోబీని ఇప్పటికే జల్లెడ పడుతున్నారు.

ఈ క్రమంలో ఇక్కడ ప్రస్తుతానికి పరిస్థితి అంతా పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా...అవి తుఫాన్ ముందరి ప్రశాంతత లాంటిదేమోననే భయం ఈ ప్రాంతవాసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు నేడు ఎపి డిజిపి ఠాకూర్ విశాఖ రానుండటం మావోయిస్టుల దృష్ట్యా చూస్తే పరిస్థితిలో మరింత ఉద్రిక్తత పెరిగేందుకు దోహదకారి అవుతోంది. మరోవైపు మావోయిస్టులు ఈ దాడిలో సెల్ ఫోన్లు వాడినట్లు గుర్తించడంతో పోలీసులు ఆ దిశలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

నివురు గప్పిన నిప్పులా...పరిస్థితి

నివురు గప్పిన నిప్పులా...పరిస్థితి

మావోయిస్టుల దాడి...వారిపై ప్రతిదాడితో ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న పోలీసు బలగాల వేట...వీటితో ఆంధ్రా-ఒడిశా బోర్డర్(ఏవోబీ)లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఏవోబీలో ఒడిశా పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ తో అడవిని జల్లెడ పడుతున్న ఆంధ్రా బలగాలు దెబ్బకు దెబ్బ తీసేందుకు తహతహలాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టుల దాడికి గురైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు...పోలీసుల్లో స్థైర్ధ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఎపి డీజీపీ ఆర్పీ ఠాకూర్ నేడు విశాఖకు రానున్నారు.

అదే...కీలకం

అదే...కీలకం

మావోయిస్టుల దాడి క్రమంలో వీడియో ఫుటేజ్ లభ్యంకావడం పోలీసులకి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఈ దాడిపై విచారణ కోసం డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో నియమించబడ్డ సిట్ బృందం ఆ వీడియో ఫుటేజ్ లోని దృశ్యాల ఆధారంగా కిడారి, సోమ హత్యలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. అలాగే ఈ హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులను సిట్ బృందం క్షుణ్ణంగా విచారిస్తోంది.

ఆ టెక్నాలజీ...వాడారా?

ఆ టెక్నాలజీ...వాడారా?

ఇదిలావుంటే మావోయిస్టులు ఎన్నడూలేని విధంగా ఈ దాడిలో సెల్‌ఫోన్లు, వాకీటాకీలు వాడినట్లు పోలీసులకు తెలియడంతో ఆ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన సిట్ బృందం ఇక్కడి కాల్‌డేటాలను నిశితంగా పరిశీలిస్తోంది. అలాగే మావోయిస్టులు వాడింది అక్రమంగా సంపాదించిన సిమ్ కార్డులతో కూడిన సాధారణ సెల్ ఫోన్లా...లేక పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అధునాతనమైన శాటిలైట్ టెక్నాలజీతో పనిచేసే సెల్ ఫోన్లా అనే మిస్టరీ నేడో రేపో తేలిపోనుంది.

అదేనా?...లక్ష్యం

అదేనా?...లక్ష్యం

ఏదేమైనా మావోయిస్టుల దాడికి కారణాలను పోలీసులు ఇప్పటివరకు జరిపిన విచారణను బట్టి విశ్లేషిస్తే ప్రధానంగా..."ప్రజలకు హానికారులుగా తాము పరిగణించే వ్యక్తుల నిర్మూలన...రెండు తమ ఉనికినే అత్యంత చులకనగా...తిరస్కారంగా తీసిపడేస్తున్న పోలీసులకు ఘాటైన హెచ్చరిక చేయడం"...అనేవి స్థూలంగా కనిపిస్తున్నాయని మాజీ సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కొద్ది రోజుల్లో...తేలిపోనుంది

కొద్ది రోజుల్లో...తేలిపోనుంది

ఇందుకోసమే నిరీక్షిస్తున్న మావోయిస్టులు అందుకోసం ఆపరేషన్ కు స్ట్రాటజికల్‌ అఫెన్స్‌, టార్గెట్‌ క్లియర్‌ మిషన్‌...(తెలుగులో దీనిని " మెరుపు దాడులు, లక్ష్యాల ఛేదన కార్యక్రమం" గా అనువదించుకోవచ్చు)కు తెర తీసి ఆ వ్యూహంలో భాగంగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను చంపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో తెలుగు రాష్ట్రాలే కాదు...మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలన్నీ ఉలిక్కిపడిన పరిస్థితి. అలా మావోయిస్టులు ఈ ‘ఎస్వోటీసీఎం' ఆపరేషన్ ద్వారా తమ బలం ఏమీ తగ్గలేదనే భావన పోలీసుల్లో కలగచేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మాజీ సీనియర్ పోలీస్ అధికారులు విశ్లేషిస్తున్నారు. మరి మావోయిస్టులు విసిరిన ఈ భీకర సవాలుకు పోలీసులు ఎలా సమాధానం చెబుతారనేది త్వరలోనే తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+