బొత్స టౌన్లో ఉద్రిక్తం: తొడకొట్టి మహిళ సవాల్(పిక్చర్స్)

విజయనగరం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకా విజయనగరం నాలుగు రోజులుగా రణరంగంగా మారింది. సోమవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు తగ్గలేదు. కర్ఫ్యూ కొనసాగుతోంది. నగరంలోని కన్యకాపరమేశ్వరి కోవెల, కొత్తపేట, దాసన్నపేట, గాజులరేగ, సీతం కళాశాల కూడళ్లలో ప్రత్యేక బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు.

విభజనను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం హింసాత్మకం కావడంతో అటు పోలీసులు, ఆందోళనకారుల మధ్య మూడు రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. బొత్స ఆస్తులను టార్గెట్ చేస్తూ సమైక్యవాదులు చెలరేగిపోతున్నారు. పరిస్థితులు చేయిదాటి పోయే ప్రమాదం రావటంతో, శనివారం రాత్రి నుంచి విధించిన కర్ఫ్యూను సైతం ఆందోళనకారులు లెక్కచేయడం లేదు. పట్టణంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఆదివారం నిరసనలు మిన్నంటాయి.

శివారు ప్రాంతాల్లో ఆందోళనలు, పోలీసులు గాల్లోకి కాల్పులు, పోలీసులపైకి రాళ్ళ వర్షం, బాష్పవాయు ప్రయోగాలు వంటి సంఘటనలతో విజయనగరం ఆదివారం అట్టుడికింది. శనివారం వరకూ రాళ్ల దాడికే పరిమితమైన ఆందోళనకారులు, ఆదివారం పరిణామాల్లో గాజుపెంకులు, నిప్పు బంతులతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో పట్టణం భీతావహంగా మారింది.

విజయనగరం 1

విజయనగరం 1

విజయనగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కొందరు ఆందోళనకారులు నిప్పు బంతులతో పోలీసుల పైకి దాడి చేసి తరిమేశారు. కాలిపోయిన జీపు.

విజయనగరం 2

విజయనగరం 2

రాష్ట్ర విభజనకు పిసిసి నేత బొత్సే కారణమంటూ ప్రజలు గాఢంగా విశ్వసించడంతో మూడు రోజులుగా సమైక్యవాదులు రగిలిపోతున్నారు. తొడగొడుతున్న ఓ మహిళ.

విజయనగరం 3

విజయనగరం 3

బొత్స ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. తీవ్రమైన పరిస్థితులతో మూడు రోజులుగా పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. పోలీసులతో వాగ్వాదం దృశ్యం

విజయనగరం 4

విజయనగరం 4

గాజులరేగలోని బొత్సకు చెందిన సీతం ఇంజనీరింగ్ కళాశాలపై దాడిచేసిన ఆందోళనకారులు ఇనుపరాడ్లు, కర్రలతో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సంఘటన తర్వాత ఆందోళనకారులు గాజులరేగవైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు వెంబడించి లాఠీలను ఝళిపించారు.

విజయనగరం 5

విజయనగరం 5

జనం బయటకు రావద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో ఆందోళనకారులు వారిపైకి రాళ్ళు రువ్వారు. ఆందోళనకారులు ఇళ్ళల్లోకి పరుగులు తీయగా, ఇళ్ళల్లోకి వెళ్ళి పోలీసులు లాఠీలతో చితకబాదారు.

విజయనగరం 6

విజయనగరం 6

బొత్స ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. తీవ్రమైన పరిస్థితులతో మూడు రోజులుగా పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. లూటీల భయంతో వ్యాపారులు వణికిపోతున్నారు.

విజయనగరం 7

విజయనగరం 7

బొత్స ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. తీవ్రమైన పరిస్థితులతో మూడు రోజులుగా పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. లూటీల భయంతో వ్యాపారులు వణికిపోతున్నారు. పోలీసుల పహారా దృశ్యం.

విజయనగరం 8

విజయనగరం 8

ఆందోళనకారులు రింగ్‌రోడ్డులోని ట్రాఫిక్ ఔట్ పోస్టును తగులబెట్టారు. రోడ్లపై రాకపోకలు సాగించకుండా ఉండేందుకు రోడ్లకు అడ్డంగా చెట్లను వేసి మంటలు పెట్టారు. విటి అగ్రహారంలో జనం బయటకు రావద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారు.

విజయనగరం 9

విజయనగరం 9

విజయనగరం పట్టణంలో హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్న వారంతా పట్టణవాసులేనని డిఐజి విక్రమ్‌సింగ్ మాన్ చెప్పారు.

విజయనగరం 10

విజయనగరం 10

విజయనగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కొందరు ఆందోళనకారులు నిప్పు బంతులతో పోలీసుల పైకి దాడి చేసి తరిమేశారు. కాల్చివేత దృశ్యం.

విజయనగరం 11

విజయనగరం 11

బొత్స ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. తీవ్రమైన పరిస్థితులతో మూడు రోజులుగా పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. లూటీల భయంతో వ్యాపారులు వణికిపోతున్నారు.

విజయనగరం 12

విజయనగరం 12

బొత్స ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. తీవ్రమైన పరిస్థితులతో మూడు రోజులుగా పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి.

విజయనగరం 13

విజయనగరం 13

ఆందోళనకారులు రింగ్‌రోడ్డులోని ట్రాఫిక్ ఔట్ పోస్టును తగులబెట్టారు. రోడ్లపై రాకపోకలు సాగించకుండా ఉండేందుకు రోడ్లకు అడ్డంగా చెట్లను వేసి మంటలు పెట్టారు.

విజయనగరం 14

విజయనగరం 14

కొత్తపేట, పల్లెవీధి, కోట, కన్యకాపరమేశ్వరీ ఆలయాల వద్ద ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్ళవర్షం కురిపించారు. ప్రతిగా పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

విజయనగరం 15

విజయనగరం 15

ఘర్షణల్లో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు డిఐజి విక్రమ్‌సింగ్‌మాన్ మీడియాకు వెల్లడించారు.

విజయనగరం 16

విజయనగరం 16

ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్ళవర్షం కురిపించారు. ప్రతిగా పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఘర్షణల్లో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరం 17

విజయనగరం 17

విజయనగరం రణరంగమైంది. విభజనను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం హింసాత్మకం కావడంతో అటు పోలీసులు, ఆందోళనకారుల మధ్య దాదాపు యుద్ధం సాగుతోంది.

విజయనగరం 18

విజయనగరం 18

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులను టార్గెట్ చేస్తూ సమైక్యవాదులు చెలరేగిపోయారు. పరిస్థితులు చేయిదాటి పోయే ప్రమాదం రావటంతో, శనివారం రాత్రి నుంచి విధించిన కర్ఫ్యూను సైతం ఆందోళనకారులు లెక్కచేయడం లేదు. పట్టణంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఆదివారం నిరసనలు మిన్నంటాయి.

విజయనగరం 19

విజయనగరం 19

శివారు ప్రాంతాల్లో ఆందోళనలు.. పోలీసులు గాల్లోకి కాల్పులు... పోలీసులపైకి రాళ్ళ వర్షం... బాష్పవాయు ప్రయోగాలు వంటి సంఘటనలతో విజయనగరం అట్టుడుకుతోంది.

విజయనగరం 20

విజయనగరం 20

బొత్స ఆస్తులే లక్ష్యంగా ఆందోళనకారులు దాడులకు దిగారు. తీవ్రమైన పరిస్థితులతో మూడు రోజులుగా పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి.

విజయనగరం 21

విజయనగరం 21

ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్ళవర్షం కురిపించారు. ప్రతిగా పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఘర్షణల్లో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరం 22

విజయనగరం 22

శనివారం వరకూ రాళ్లదాడికే పరిమితమైన ఆందోళనకారులు, ఆదివారం నాటి పరిణామాల్లో గాజుపెంకులు, నిప్పు బంతులతో పోలీసులపై దాడికి దిగారు.

విజయనగరం 23

విజయనగరం 23

ప్రతిగా పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఘర్షణల్లో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు డిఐజి విక్రమ్‌సింగ్‌మాన్ మీడియాకు వెల్లడించారు.

విజయనగరం 24

విజయనగరం 24

ఆందోళనకారులు రింగ్‌రోడ్డులోని ట్రాఫిక్ ఔట్ పోస్టును తగులబెట్టారు. రోడ్లపై రాకపోకలు సాగించకుండా ఉండేందుకు రోడ్లకు అడ్డంగా చెట్లను వేసి మంటలు పెట్టారు.

విజయనగరం 25

విజయనగరం 25

యువకులే దాడులకు పాల్పడుతున్నట్టు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.

విజయనగరం 26

విజయనగరం 26

బొత్స ఆస్తులే లక్ష్యంగా ఆందోళనకారులు దాడులకు దిగారు. తీవ్రమైన పరిస్థితులతో మూడు రోజులుగా పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+