విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రిపుల్ మర్డర్: పోలీసుల అదుపులో సిఐ, కానిస్టేబుళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

High way shooting: CI role suspected
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో పెద్దవుటుపల్లి వద్ద జరిగిన ట్రిపుల్‌ మర్డర్‌ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఒక సీఐ, మరికొందరు పోలీసుల పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక సీఐ, ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

హంతకులకు సహకరించడంతోపాటు హతులకు సరైన రక్షణ కల్పించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. సీఐ దురుద్దేశంతో వ్యవహరించారని దర్యాప్తులో తేలడంతో సిఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి పోలీసులు ఏ విధమైన సమాచారం అందించడం లేదు.

గత నెల 24వ తేదీన కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వర రావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కోసులో మారం శ్రీనివాస్, గణేష్ సహా స్థానికులు ఆరుగురు నిందితులుగా ఉన్నారు.

ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు వీలైనంత త్వరగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోతారని, అప్పటి వరకు వారిని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టవద్దని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

English summary
It is said that Vijayawada police are questioning a CI and 3 constables in Krishna district tripple murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X