"అసలు మైసూరా రెడ్డి ఖాతాలో ఎంత డబ్బుంది?"

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. నోట్ల రద్దును సవాల్ చేస్తూ.. మాజీ ఎంపీ మైసూరా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఖాతాలో డబ్బులున్నా.. బ్యాంకులు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని పిటిషన్ లో మైసూరా ఆరోపించారు.

 Highcourt Questioned Mysoora over his bank account details

మైసూరా దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టింది హైకోర్టు. నోట్ల రద్దుతో కొంతకాలం కష్టాలు తప్పవని కేంద్రం ముందే చెప్పింది కదా! అని ఈసందర్బంగా హైకోర్టు ప్రస్తావించింది. అసలు మైసూరా రెడ్డి ఖాతాలో ఎంత డబ్బు ఉందో చెప్పాలని ప్రశ్నించింది. అదే సమయంలో.. ప్రస్తుతం సామాన్యులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, అయితే జీతం డబ్బుల మీదే ఆధారపడే సగటు ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరముందని కోర్టు పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Highcourt questioned Ex-MP Mysoora Reddy over his bank account details. Court asked to say how much money will have mysoora in his account?
Please Wait while comments are loading...