విలీనం: స్వామి గౌడ్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిఆర్‌ఎస్‌ఎల్పీలో టిడిఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిపదికన టిడిపి ఎమ్మెల్సీలను టిఆర్ఎస్‌ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
మార్చి 9న తెలుగుదేశం ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండి సలీంలను టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

టిఆర్‌ఎస్‌ఎల్పీలో టిడిఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ టిడిపి నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా
జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ కొనసాగింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు నివేదికను సమర్పించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణ ఎందుకు ఆలస్యమవుతుందో నివేదికలో పేర్కొంది. కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.












Click it and Unblock the Notifications