అన్యమత ప్రచారం: హిందూ సమితి నేతల ఆందోళన

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో తరచూ చోటు చేసుకుంటున్న అన్యమత ప్రచారంపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలో నిషేధాజ్ఞలు ఉన్నా తరచూ సాగుతున్న అన్యమత ప్రచారంపై సమితి మంగళవారం టిటిడి కార్యాయాలన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది.

భారీ సంఖ్యలో వచ్చిన సమితి నేతలు, కార్యకర్తలు టిటిడి కార్యాలయం వద్దకు వెళుతుండగా వారిని నగరంలోని శ్రీనివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకున్న పోలీసులను సమితి కార్యకర్తలు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Hindu Dharma Parirakshana Samiti protest at Tirumala

సమాచారం అందుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి అక్కడకు చేరుకుని పరిస్థితి చేయి దాటిపోకుండా చర్యలు చేపట్టారు. కాగా ఈ ఆందోళనలో సుమారు 5వేల మంది స్వామిజీలు, సమితి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చాలా మంది కార్యకర్తలను పోలీసులు తిరుపతి రైల్వే స్టేషన్‌లోనే అరెస్ట్ చేశారు. సమితి నేతలు టిటిడి ఈవోను తక్షణమే కలుస్తామని సమితి నేతలు డిమాండ్ చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని, టిటిడిలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని సమితి నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం హజ్ యాత్రకు ఏ విధంగా సబ్సిడీ ఇస్తుందో.. తిరుమలకి వచ్చే వారికి కూడా ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+