Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా బాధితులకు బాలయ్య సాయం- 2 వేల స్పెషల్‌ కిట్లు- ప్రత్యేకతలివే

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ దెబ్బకు ప్రతీ గ్రామం, పట్టణం, నియోజకవర్గంలో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వైద్యం కూడా చేయించలేని పరిస్ధితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీంతో స్ధానిక నేతలే పలు చోట్ల జనాన్ని ఆదుకుంటున్నారు. ఇదే కోవలో హిందూపూర్‌ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ కూడా ముందుకొచ్చారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీన‌టుడు బాలకృష్ణ ప్ర‌జ‌ల‌కు రూ.20 ల‌క్ష‌ల విలువ చేసే క‌రోనా మందుల‌ను సాయంగా అందించారు. హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీలోని బాల‌య్య‌ నివాసం వద్ద స్థానిక టీడీపీ నాయకులు వాటిని ప్ర‌జ‌లకు అందజేశారు.
క‌రోనా లక్షణాలు ఉన్న వారు ఆధార్ కార్డుతో బాల‌య్య నివాసానికి వస్తే, కరోనా మందులను అందజేస్తామని టీడీపీ నేత‌లు తెలిపారు.

hindupur mla balakrishna sent 2000 covid kits to victims in own constituency

కరోనాతో హిందూపురం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన బాల‌కృష్ణ ఈ రూ.20 లక్షలు విలువ చేసే మందులను పంపిణీ చేస్తున్నార‌ని టీడీపీ నేతలు తెలిపారు. ఇవి చాల‌క‌పోతే మరిన్ని కొవిడ్ ఔష‌ధాల‌ను కూడా ఇవ్వ‌డానికి త‌మ నేత సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.

hindupur mla balakrishna sent 2000 covid kits to victims in own constituency

అందుకే తాము ముందుకు వచ్చి ప్రజల్ని ఆదుకుంటున్నట్లు హిందూపురం టీడీపీ నేతలు తెలిపారు. గతంలోనూ కోవిడ్‌ బారిన పడిన హిందూపురం ప్రజలకు బాలయ్య సాయం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+