ఏపీ రూ.5 లక్షలు: మృతి చెందిన వారి లిస్ట్.., అక్కడ అనుమానాస్పద పరికరం!

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు పరిహారం ప్రకటించింది.

విజయనగరం: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు పరిహారం ప్రకటించింది.

మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని విశాఖ, విజయనగరం కలెక్టర్లను ఆదేశించారు.

Hirakhand Express accident: CM Chandrababu announces ex gratia relief

రైలు ప్రమాద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్టీసీని చంద్రబాబు ఆదేశించారు. విశాఖ - భువనేశ్వర్‌ రైలు మార్గాన్ని పునరుద్ధరించాలని రైల్వే డీఆర్‌ఎంను కోరారు.

Hirakhand Express accident: CM Chandrababu announces ex gratia relief

మృతి చెందిన వారి జాబితా..

ఎం కృష్ణ (35), పీ శ్రీను (25), బీ కమల (50), గాయత్రి సాహు (14), దిలీప్ కేఆర్ రౌత్ (51), టీకే మాయింజ్ (45), సోము అన్నమ్మ, విష్ణుప్రసాద్ సాహు, రాజన్ నాయక్ (18), సుబాష్ సీహెచ్ సాహు (60), ఎస్ రేణుక, పీ పోలి (35), జశోదా పండిట్, రాంప్రసాద్ పండిట్, రేవతి (16), మోండాల్ బలరాం, సుబా బారతి సాహు, తపన్ కుమార్ ప్రదాన్ (26). రైల్వే అధికారులు 18 మంది మృతుల వివరాలు వెల్లడించారు.

Hirakhand Express accident: CM Chandrababu announces ex gratia relief

అనుమానాస్పద పరికరం!

రైలు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని రైల్వేశాఖ హెచ్చరించింది. ప్రమాదం వెనుక కుట్ర ఉన్నట్టు రైల్వేశాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తుకు ఆదేశించింది. రైలు ప్రమాదం జరిగే ప్రాంతం నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో రైల్వే అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Hirakhand Express accident: CM Chandrababu announces ex gratia relief

సంఘటనా స్థలంలో అనుమానాస్పద పరికరం లభ్యం కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నక్సలైట్లు తమ ఉనికిని చాటేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+