Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్యామిలీలో 5గురు మృతి: రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం?, మోడీ స్పందన

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో రాయగఢ్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖుడ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయనగరం: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో రాయగఢ్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖుడ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hirakhand Train Accident: PM Narendra Modi Condoles Andhra Pradesh Train Derailment Victims

ఈ రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతం నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది. దీంతో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని రైల్వే వర్గాలు చెబుతున్నారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేదు. గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న నేపథ్యంలో నక్సల్స్‌ తమ ఉనికి చాటుకునేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hirakhand Train Accident: PM Narendra Modi Condoles Andhra Pradesh Train Derailment Victims

గూడ్స్ వెళ్లింది.. చెక్ చేశారు

ప్రమాదం జరగడానికి ముందు అదే ట్రాక్ పై నుంచి ఓ గూడ్స్ రైలు వెళ్లింది. అంతేకాదు, ప్రమాదానికి ముందు తనిఖీలు కూడా చేశారు. అయిప్పటికీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పూర్తయితే ఏదో తెలియనుంది.

నరేంద్ర మోడీ స్పందన

రైలు ప్రమాదం పైన ప్రధాని మోడీ స్పందించారు. ఇది విషాదకర ఘటన అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Hirakhand Train Accident: PM Narendra Modi Condoles Andhra Pradesh Train Derailment Victims

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటన ఓ కుటుంబానికి తీరని ఆవేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో అయిదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

బీహార్‌కు చెందిన కుటుంబం దేశంలోని అన్ని ప్రాంతాలు తిరిగి తేనెపట్టును సేకరిస్తుంటుంది. 10 మంది సభ్యులు గల ఈ కుటుంబం హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. వీరు విజయనగరంలో దిగాల్సి ఉంది. అయితే కూనేరు వద్ద రైలు పట్టాలు తప్పడంతో అయిదుగురు దుర్మరణం పాలయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+