రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెలవు ఇవ్వలేదని హోంగార్డు ఆత్మహత్యాయత్నం, 20, 21 తేదీల్లో పాఠశాలలకు సెలవు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలను ప్రభుత్వాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాయి. పుష్కరాల్లో భక్తులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో అటు అధికారులు, ఇటు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు.

అయితే పుష్కరాలకు వచ్చిన భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రి పుష్కర విధుల్లో ఉన్న కడప జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ అనే హోంగార్డు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Photos: భక్తుల రద్దీ

Home guard suicide attempt for leave in rajahmundry

ఈ సంఘటన రాజమండ్రిలో సంచలనం సృష్టించింది. సెలవు ఇవ్వలేదనే కారణంతోనే హోంగార్డు దుర్గా ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

20, 21 తేదీల్లో ఏపీలోని పాఠశాలలకు సెలవు

గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. జులై 20, 21న ఏపీలోని అన్నీ పాఠశాలలకూ సెలవు దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల నేపథ్యంలోనే ఈ ప్రకటనను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

English summary
Home guard suicide attempt for leave in rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X