వివేకా హత్య కేసులో బిగ్ టర్న్ - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆసక్తికర అంశాలు కొనసాగుతున్నాయి. తన తండ్రి హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న వివేకా కుమార్తు సునీత తొలి సారి ఏపీ సచివాలయానికి వచ్చారు. హోం మంత్రి అనితతో భేటీ అయ్యారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోమ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి వివేకా హత్య కేసులో న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ దక్కింది.

అనితతో సునీత భేటీ
వైఎస్ వివేకా కుమార్తె సునీత సచివాలయంలో హోం మంత్రి సునీతతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం పై అనితకు సునీత వివరించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్ష్యుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. సునీత నుంచి అనిత మరింత సమాచారం సేకరించారు.

Home minister Anitha Assured Sunitha over justice in YS viveka Murder case

వివేకా హత్య కేసుపై
సునీతకు హోం మంత్రి అనిత కీలక హామీ ఇచ్చారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న అనిత తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా శాంతి భద్రతల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సమయంలోనూ వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారు. వివేకాను చంపింది ఎవరో త్వరలోనే బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తాజా హామీతో
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సునీత ప్రభుత్వం నుంచి సహకారం కోరలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నేరుగా సచివాలయానికి వచ్చారు. అటు కోర్టులో అవినాశ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజా ఎన్నికల సమయంలోనూ జగన్ ను ఓడించాలని సునీత పిలుపునిచ్చారు. అటు షర్మిల సైతం ఈ కేసు విషయంలో జగన్ దోషులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణ చేసారు. ఇప్పుడు ఈ కేసులో సునీత నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించటంతో..కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+