ఫేస్‌బుక్ పరిచయం: కూతుర్ని ప్రేమించాడని చంపేసిన తండ్రి
తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతుర్ని ప్రేమించాడని ఆమె తండ్రి ఓ యువకుడ్ని చంపేసి, గోతిలో పాతి పెట్టారు.
రాజమహేంద్రవరం: తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతుర్ని ప్రేమించాడని ఆమె తండ్రి ఓ యువకుడ్ని చంపేసి, గోతిలో పాతి పెట్టారు.
ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడయింది. కొద్ది రోజులుగా మృతుడు రామాంజనేయులు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు కోణాల్లో విచారించి, యువతి తండ్రే చంపేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు.

నిందితుడిని విజయ్ కుమార్‌గా గుర్తించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్ కుమార్ కూతురు, మరో పక్క గ్రామానికి చెందిన యువకుడు రామాంజనేయులుకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారిందని చెబుతున్నారు.
ఈ విషయం విజయ్ కుమార్‌కు తెలిసింది. దీంతో అతను రామాజనేయులును హత్య చేసి కరవాడ బీచ్‌లో పాతిపెట్టాడని తెలుస్తోంది. అయితే, అమ్మాయి, మృతుడు.. ఇరువురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
మరోవైపు, నిందితుడు విజయ్ కుమార్ గ్రామానికి చెందిన కొందరు మరో వాదన వినిపిస్తున్నారు. రామాంజనేయులు, యువతి మధ్య ప్రేమ లేదని, అతను నిత్యం వేధించేవాడని చెబుతున్నారు.
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications