ఏపీలో పశువులకు హాస్టల్స్.. మూగజీవాల సంరక్షణ వదిలిపెట్టని చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వినూత్న ఆలోచనలతో, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఏపీలో ప్రజల కోసం మాత్రమే కాకుండా, పశువుల సంరక్షణ కోసం కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త ఆలోచన చేసింది. పశువుల కోసం ప్రత్యేక హాస్టల్స్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది.

స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పశువుల కోసం చంద్రబాబు ప్రకటన
పట్టణాలలో రోడ్లమీద తిరుగుతూ రోడ్ల మీద ఉండే పశువులకు ఆశ్రయం కల్పించి, వాటికి మేతను, ఇతర సదుపాయాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత నెల 20వ తేదీన మాచర్లలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని నేరుగా వెల్లడించారు.

Hostels for cattle in AP Chandrababu shows care for cattle

Take a Poll

157 నియోజకవర్గాలలో పశువుల హాస్టల్స్
రాష్ట్రంలోని 157 నియోజకవర్గాలలో పశువుల హాస్టల్ లను ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణం పైన దృష్టి సారించాలని పేర్కొన్న చంద్రబాబు ఈ షెడ్ల నిర్వహణ పశుపోషణ బాధ్యతలను డ్వాక్రా మహిళలతో నిర్వహించనున్నారు.

పశువుల విషయంలో చంద్రబాబు ప్లాన్ ఇదే
పశువుల సంఖ్యను పెంచడం, పాల ఉత్పత్తిని వృద్ధి చేయడం, పశువులకు వచ్చే వ్యాధులను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పశువుల షెడ్ల ఏర్పాటుతోపాటు, పాల ఉత్పత్తి యూనిట్లు, పాల చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, పశువుల పేడతో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.

పశువుల హాస్టల్స్ ఏర్పాటు వెనుక కారణాలివే
రోడ్ల మీద తిరుగుతున్న పశువులు ప్లాస్టిక్ ను, కాగితాలను తింటూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని, పశువుల వల్ల ట్రాఫిక్ జామ్ లు, కాలుష్యం పెరిగిపోతోందని చంద్రబాబు అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి పశువుల హాస్టల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా తడకనపల్లె లో ప్రభుత్వం పశువుల హాస్టల్ ఒకటి ఏర్పాటు చేసింది.

కర్నూలు జిల్లా తడకనపల్లె పశువుల హాస్టల్ సక్సెస్ తో నిర్ణయం
2017 లో ఈ హాస్టల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో పశువులకు షెడ్లను నిర్మించి, ఆ పశువుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూప్ మహిళలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ పశువుల హాస్టల్ డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఈ హాస్టల్ పాలు ఉత్పత్తిలో దూసుకుపోతూ అక్కడ పనిచేసే మహిళలకు ఒక వరంగా మారింది. ఇక ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కూడా పశువుల హాస్టల్స్ ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సంకల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+