వాడిగావేడిగా అఖిలపక్షం: నిలదీసిన మధు, అందుకేనని బాబు సమాధానం
అమరావతి: అఖిల పక్ష సమావేశంలో సీపీఎం మధు, సీఎం చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చంద్రబాబు నేతృత్వంలో బుధవారం అఖిలపక్ష భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీ హాట్ హాట్‌గా సాగింది.
Recommended Video

ఈ భేటీ సందర్భంగా మధు మాట్లాడుతూ.. హోదాపై టీడీపీ ఇన్నాళ్లు మెతక వైఖరి అవలంభించిందన్నారు. మొదటి నుంచి ఈ దూకుడు ఉంటే బాగుండేదన్నారు. ఏ రాష్ట్రానికి జరగనంత అన్యాయం ఏపీకి జరిగిందన్నారు.

దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగేళ్ల తర్వాత అడిగితేనే కేంద్రం వైఖరి ఇలా ఉందని, మొదటి నుంచి దూకుడుగా ఉంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేదన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి ఓపికగా ఉంటే బాగుండేదని విమర్శిస్తారన్నారు. ఏపీ పసిగుడ్డు అని, జాగ్రత్తగా ముందుకెళ్తున్నామని చెప్పారు.
చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాసానికే రూ.33వేల కోట్లు అవసరం అన్నారు. కాపర్ డ్యామ్ పూర్తయితే ఈ ఏడాది గ్రావిటీ నీటికి అవకాశముంటుందన్నారు. అమరావతికి రూ.1500 కోట్లు ఇస్తామన్నారు.

డిస్కంల సంస్థల పవర్ డ్యూస్ తెలంగాణ నుంచి సర్దుబాటు చేస్తామని కేంద్రం చెప్పిందని, కానీ ఇంతవరకు తేల్చలేదన్నారు. 9, 10వ షెడ్యూల్ వివాదాలు పరిష్కారం కాలేదన్నారు.
మెట్రో విషయంలో పాలసీ మార్చారని చెప్పారు. ఇక్కడ వయబిలిటీ లేదన్నారని, లైట్ మెట్రో అన్నారని, ఇతర రాష్ట్రాలకు అభ్యంతరాలు లేకుండా ఉదారంగా ఇచ్చారన్నారు. ఏపీ విషయానికి వచ్చేసరికి పాలసీలు మార్చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications