గ్యాంగ్‌రేప్: నిందితుల ఫోటోతో ఫేస్‌బుక్‌లో ప్రచారం చేసిన సునీతపై దాడి
హైదరాబాద్: రేపిస్టులు వీరే.. పట్టుకోవాలంటూ సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో వీడియో షేర్ చేసిన స్వచ్చంధ కార్యకర్త సునితా కృష్ణన్ పైన శుక్రవారం నాడు హైదరాబాదులోని పాతబస్తీలో దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రజ్వల హోం నిర్వాహకురాలైన సునితా కృష్ణన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
దుండగుల నుండి సునితా కృష్ణన్‌కు కొంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పుడు పాతబస్తీలో ఆమె కారు పైన దాడి జరిగింది. రేపిస్టులో ఈ దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. కారు పైన రాళ్లతో దాడి చేశారు. అయితే, ఎవరు చేశారనే విషయం కచ్చితంగా తెలియాల్సి ఉంది.
కాగా, ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితుల ఫొటోలను ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆ కారణంగానే ఆమెపై దుండుగులు దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొంతకాలంగా ఆమెకు పలు బెదిరింపులు కూడా వస్తున్నాయి. అయినా ఆమె వాటిని లెక్క చేయకుండా అత్యాచార బాధితులకు బాసటగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా.. సునితా కృష్ణన్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన అత్యాచార నిందితుల ఫొటోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జాతీయ చానెళ్లు కూడా ఈ ఘటనపై స్పందించాయి. దీంతో అత్యాచారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు.
నిందితులు సదరు యువతి పైన అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు. ఈ ఘటన విషయంలో సునిత కృష్ణన్ బాధితురాలికి అండగా ఉంటున్నారు. ఇందులో భాగంగా ఆమె శుక్రవారం నాడు పాతబస్తీకి వచ్చారు. మరోవైపు అత్యాచార నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. యూట్యూబ్ లింక్ ఆపేయాలని డీజీపీ సూచించారు.
In 30 mins that I announced on Ndtv #ShameTheRapistCampaign at 9.30am this morning my vehicle vandalizef pic.twitter.com/Y8l0RFiB7D
— sunitha krishnan (@sunita_krishnan) February 6, 2015 











Click it and Unblock the Notifications