ఫ్లాష్ బ్యాక్ తో వైసీపీని భయపెట్టిన చంద్రబాబు-156 మంది ఎమ్మెల్యేలున్నా.. ?

అమరావతి : ఏపీలో ఫిరాయింపు రాజకీయాల్నిప్రోత్సహించడంలో దిట్ట అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ నిలబెట్టిన ఏడో అభ్యర్దితో పాటు ఆ పార్టీ అధిష్టానాన్నీ కలవరపెట్టారు. తగినంత బలం లేకపోయినా ఎమ్మెల్సీ పోరులో బరిలోకి దిగడంతో పాటు ఎన్నికను గెలిచేందుకు టీడీపీ చేసిన సీరియస్ ప్రయత్నాలు చూస్తే.. చంద్రబాబు వ్యూహాల్ని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అభినందించక తప్పలేదు.

ఎమ్మెల్సీ పోరులో చంద్రబాబు ఎత్తులు

ఎమ్మెల్సీ పోరులో చంద్రబాబు ఎత్తులు

ఇవాళ ఏపీలో ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ లో ఎక్కడ చూసినా చంద్రబాబు పేరే వినిపించింది. ఈ ఎన్నికల్లో ఆరు స్దానాలు గెలిచేందుకు తగినబలం ఉన్నవైసీపీ.. టీడీపీ, జనసేన ఫిరాయింపు ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకుని మైండ్ గేమ్ కు తెరదీసింది. దీన్నికౌంటర్ చేసేందుకు చంద్రబాబు కూడా అంతకు మించిన గేమ్ కు తెరలేపారు. ఓ ఎమ్మెల్సీ స్ధానం గెలిచేందుకు అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి తన దగ్గర లేరని తెలిసీ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధను నిలబెట్టారు. దీంతో కలకలం మొదలైంది.

ఫ్యాష్ బ్యాక్ తో భయపెట్టిన చంద్రబాబు !

ఫ్యాష్ బ్యాక్ తో భయపెట్టిన చంద్రబాబు !

ఇవాళ ఏపీ అసెంబ్లీలో జరుగుతున్నఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గమనిస్తే ఓటు వేసేందుకు వచ్చిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు గురించి చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఓటుకు నోటుసమయంలోనూ,అంతకుముందు వైశ్రాయ్ ఎపిసోడ్ సమయంలోనూ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్ అనుభవాల్ని ఎమ్మెల్యేలు గుర్తు చేసుకుంటూ కనిపించారు. చంద్రబాబు ఏమైనా చేస్తాడని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పుకుంటుంటే,ఈసారి చంద్రబాబు అనుభవం బయటపడుతుందని, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అనురాధ గెలిచి తీరుతారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పుకోవడం కనిపించింది.

చివరి నిమిషం వరకూ అదే టెన్షన్ ?

చివరి నిమిషం వరకూ అదే టెన్షన్ ?

ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు వైసీపీ తమ ఎమ్మెల్యేలను పూర్తిగా సిద్ధంచేసింది. ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలకు చోటివ్వరాదని ఎమ్మెల్యేలకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రతీ 22 మంది ఎమ్మెల్యేలకు ఓ మంత్రిని కూడా కేటాయించారు. రాత్రి విజయవాడ హోటళ్లలోనే ఎమ్మెల్యేలను ఉంచారు. అయితే అక్కడి నుంచి కొందరు జారుకున్నారు. మరికొందరు బయటికి వెళ్లిపోయి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా కలవరపెట్టారు. చివరికి ఎమ్మెల్యేలు అంతా తరలివచ్చి ఓటేశారు. అయితే ఇందులో ఎవరు ఎవరికి ఓటు వేశారన్నదానిపై సస్పెన్స్ మాత్రం లాస్ట్ మినిట్ వరకూ కొనసాగుతోంది. దీంతో చివరి నిమిషం వరకూ వైసీపీని కలవరపెట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+