అకస్మాత్తుగా రూట్ మారితే రైలు డ్రైవర్ ఏం చేయాలి?
వివిధ పనుల నిమిత్తం మనం తరుచుగా రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. అయితే రైలు ఎక్కినప్పుడు ఆ బండి సరైన మార్గంలోనే వెళుతుందా? లేదా? అనే ప్రశ్న మనల్ని తొలిచేస్తుంటుంది. రైలు లోకో పైలెట్ కు ఈ విషయం ఎలా తెలుస్తుంది? తదితర విషయాలను తెలుసుకుందాం. రైలును నడిపే లోకో పైలెట్స్ ట్రాక్‌లను నావిగేట్ చేయడానికి సిగ్నళ్లు, ట్రాక్ స్విచ్‌లు, షెడ్యూల్‌ల కలయికను ఉపయోగిస్తారు.
ట్రాక్ ల సంకేతాలిస్తారు : రైలు నడిచిన తర్వాత, అది సురక్షితంగా కొనసాగడానికి ట్రాక్‌ల గురించి సంకేతాలు ఇస్తారు. అవసరమైతే పైలట్ ట్రాక్‌లను మార్చడానికి కూడా అనుమతి లభిస్తుంది. ఏ మార్గాలలో వెళ్లాలి, ఎప్పుడు ఆపాలి అనే షెడ్యూల్‌ను లోకో పైలెట్లు అందుకుంటారు. రైలు ఏ మార్గంలో అయితే ప్రయాణిస్తుందో దానికి సంబంధించిన డివిజన్ లోని రైల్వే కంట్రోల్ రూమ్ ద్వారా రైలు వెళ్లాల్సిన మార్గాలను నిర్ణయిస్తారు.

రైల్వే.. షెడ్యూల్ ను రూపొందిస్తుంది : ఈ షెడ్యూల్ ను రైల్వే నిర్ణయిస్తుంది. హోమ్ సిగ్నల్ ద్వారా రైలును నడుపుతున్నప్పుడు ఎక్కడికి వెళ్లాలి? అనే సమాచారాన్ని పైలెట్ అందుకుంటాడు. రైలు వేగాన్ని నియంత్రించడంతోపాటు షెడ్యూల్ చేసిన స్టేషన్ల లో రైలును ఆపడం పైలెట్ బాధ్యత. ఇంతకుముందు ట్రాక్ లోని ప్రతి సెక్షన్ లో ఉన్న క్యాబిన్ బాయ్ చేత పట్టాలను మాన్యువల్గా మార్పించేవారు. ఇప్పుడు మాత్రం ఆధునిక ఎలక్ట్రానిక్స్ పరికరాలతో ప్రక్రియను మరింత సమర్థవంతంగా రూపొందించారు.
కాలానుగుణంగా ఆధునిక సౌకర్యాలు : కాలానుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై భారతీయ రైల్వే దృష్టిసారించింది. ఇందులో భాగంగా తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరుకునేలా వందే భారత్ రైళ్లను రూపొందించింది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు రెండు వందేభారత్ లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఇవి నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications