కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి.. అప్పులు చేసి ఎంతకాలం పాలన చేస్తావ్ : జగన్‌పై కిషన్ రెడ్డి ఫైర్‌

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అరాచక పాలన రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీలో చేరిన వారిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము. కానీ ఇంతటి నియంత పాలన ఏపీలోనే చూస్తున్నామని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి నియంతలైనా పతనం కాకదప్పదని హెచ్చరించారు. అవినీతిలో జగన్ ప్రభుత్వం కూరుకుపోయిందని విమర్శించారు.

అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్..

అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్..


జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తోందని విమర్శించారు. అప్పులపై ఆధారపడి జగన్ ఎంత కాలం పాలన చేస్తారని ప్రశ్నించారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా ఎంతకాలం ఇస్తారని అన్నారు. కడపలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ రణభేరిలో కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ సునీల్ దేవ్‌ధర్, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి పురధేశ్వరి, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రతిఏటా రైతుకు ఇస్తున్న రూ 6వేలను కూడా వైసీపీ ప్రభుత్వం వారే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. అవినీతి పాలనకు అంతం తప్పదని హెచ్చరించారు.

లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియా..

లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియా..


ఏపీలో లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.. వీరి అరాచకాలకు అడ్డుకట్టపడాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వచ్చినా సీమ అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. ఈ ప్రాంత వెనుకుబాటుకు సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్షమే అని పేర్కొన్నారు. సీమ అభివృద్ధికి తొలి నుంచి పోరాడుతుంది బీజేపీయే అని అన్నారు. రాయల సీమ కోసం సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం

అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం సొంత జిల్లా కడపలోనే అభివృద్ధి కన్పించడంలేదని విమర్శించారు. అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిధులతో పూర్తి చేస్తామని తెలిపారు. రాయల సీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని సోము వీర్రాజు తెలిపారు.

 న‌మ్మించి మోసం చేస్తున్న జ‌గ‌న్‌..

న‌మ్మించి మోసం చేస్తున్న జ‌గ‌న్‌..


రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను నమ్మి గద్దెనెక్కిస్తే వారికే అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి విమర్శించారు. కేంద్రం చేసిన అభివృద్దే రాయలసీమలో కనిపిస్తోందని అన్నారు. నాడు ఎన్టీఆర్ రాయలసీమ దత్తపుత్రిడిగా ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ ప్రతి పథకంలో అవినీతే కన్పిస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు కూడా స్వాహా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అనిచెప్పి గద్దెనెక్కి ప్రజలను జగన్ ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Liquor, mining, land mafia in AP .. Kishan Reddy is serious on Jagan govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X