రైలు మైలేజ్ ఎంతొస్తుందో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. లక్షల సంఖ్యలో ఉద్యోగులను, కార్మికులను కలిగివున్న భారత రైల్వే తన ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనకు టూవీలర్, ఫోర్ వీలర్ ఉన్నప్పుడు పెట్రోల్ కొట్టిస్తే ఎంత మైలేజీ వస్తుందనే విషయంపై అవగాహన ఉంటుంది. మరి రైలుకు కూడా ఎంత మైలేజీ వస్తుందో తెలుసుకుందాం.
రైలుకు మైలేజీ అనేది ప్యాసింజరా? ఎక్స్ ప్రెసా, ఆ రైలుకు ఉన్న బోగీలను బట్టి ఆధారపడివుంటుంది. తక్కువ సంఖ్యలో కోచ్ లు ఉంటే ఆ ప్రభావం ఇంజిన్ పై పడుతుంది. శక్తి పెరిగి మైలేజీ కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా రైలు మైలేజీని కిలోమీటర్ల లెక్క కాకుండా గంటల లెక్కలో లెక్కిస్తారు. 24 నుంచి 25 వరకు బోగీలుంటే ఒక రైలు కిలోమీటరుకు 6 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ రైళ్లకన్నా ప్యాసింజర్ రైళ్లకు మైలేజీ తగ్గుతోందని రైల్వేశాఖ చెబుతోంది.

ఒక కిలోమీటరు దూరం ప్రయాణించడానికి ఒక ప్యాసింజరు రైలు 6 లీటర్ల డీజిల్ ను ఖర్చుచేస్తోంది. దీనికి కారణం.. ఆగే స్టేషన్లు ఎక్కువగా ఉండటమే. అలాగే 12 బోగీలుండే సూపర్ ఫాస్ట్ కానీ, ఎక్స్ ప్రెస్ కానీ కిలోమీటరు దూరం ప్రయాణించడానికి 4.5 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. రైలు బండికి వచ్చే మైలేజీ దాని ఇంజన్ శక్తి ఆధారపడివుంటుంది. తరుచుగా స్టేషన్లలో ఆగడానికి బ్రేకులు ఉపయోగించడం, ఎత్తు ఎక్కడం, ఎక్కువ లోడ్.. తదితర అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయి.
ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ పొందుతున్న రైల్వేను మరింతగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వందే భారత్, ఆత్మగౌరవ్ పేరుతో రైళ్లు ప్రవేశపెడుతోంది. బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏయే మార్గాల్లో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టాలనే విషయమై రైల్వేశాఖ సర్వే చేస్తోంది.












Click it and Unblock the Notifications