ఒక రైలు తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
భారతీయ రైల్వే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రతి రైలులో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయనే సంగతి తెలిసిందే. కోచ్ లు, అందులోని సౌకర్యాల కల్పనపై ఆధారపడి వీటి ధర ఉంటుంది. రైళ్లల్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్ లు, జనరల్ కోచ్ లు, గార్డు కోచ్ ఉంటాయి.
ఇంజిన్ అత్యంత ఖరీదైంది. దాని తయారీకి భారీగా నగదును వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన రైళ్లల్లో రెండు రకాల ఇంజన్లు ఉపయోగిస్తున్నారు. ఒకటిఎలక్ట్రిక్ ఇంజన్ కాగా, మరొకటి డీజిల్ ఇంజన్లు. ఒక ఇంజన్ తయారు చేయడానికి దాదాపు రూ. 13 నుంచి 20 కోట్లు ఖర్చవుతుందని రైల్వే నివేదికలు తెలియజేస్తున్నారు. ఇంజిన్ శక్తిని బట్టి ఈ ధర పెరుగుతుంటుంది.. తగ్గుతుంటుంది.

ఒక కోచ్‌ను సిద్ధం చేయడానికి దాదాపు రూ. 2 కోట్లు ఖర్చవుతుంది. తర్వాత ఆ బోగీకి కల్పించే సౌకర్యాలను బట్టి ధర ఆధారపడివుంటుంది. సాధారణ బోగీ తయారీకి ఖర్చు తక్కువవుతుంది. ఇందులో సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఏసీ కోచ్ తయారీకి ఎక్కువ నగదును ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహజంగానే ఇందులో అన్నిరకాల సౌకర్యాలుంటాయి.
ఒక రైలు తయారుకావడానికి రూ.66 కోట్ల ఖర్చవుతుంది. ప్యాసింజర్ రైలులో 24 బోగీలుండగా ఒక్కో బోగీకి రూ.2 కోట్లు ఖర్చవుతోంది. బోగీల ధర రూ.48 కోట్లుగా తేలుతుంది. తర్వాత ఇంజన్ సగటు ధర రూ.18 కోట్లు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ ఇంజిన్‌లెస్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను తయారు చేసేందుకు రూ.115 కోట్లు ఖర్చవుతుంది. PTI వార్తాసంస్థ నివేదిక ప్రకారం, కొత్త తరం 16-కోచ్ ఇంజన్ లేని సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైలును తయారుచేయడానికి రూ. 110 నుంచి రూ. 120 కోట్ల ఖర్చవుతుంది.












Click it and Unblock the Notifications