ఎపి భవన్ లో భద్రత లేదు, మావోలు దాడులు చేయవచ్చు,బాబుకు భద్రత పెంపు
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు న్యూఢిల్లీలో ఎలా రక్షణ కల్పించాలనే దానిపై ఢిల్లీ పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారంగా బాబు పర్యటన ఢిల్లీలో సాగకపోవడంతో ఢిల్లీ పోలీసులు ఆందోళన .
న్యూఢిల్లీ :ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నాడు. ఢిల్లీలో చంద్రబాబుకు రక్షణ కల్పించడం సవాల్ గా ఉందని నేషనల్ సెక్యూరిటీ గార్డులు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది అక్టోబర్ మాసంలో ఆంద్రప్రదేశ్ ..ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో చోటుచేసుకొన్న ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు, సుమారు 30 కిపై మావోలు మరణించారు.
ఈ ఘటనలో మావో అగ్రనేతలు రామకృష్ణ , ఆశోక్ తప్పించుకొన్నారు.అయితే ఈ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకొంటామని మావోలు ప్రకటించారు.

న్యూఢిల్లీ కేంద్రంగా బాబుపై దాడికి మావోల రెక్కీ
ఆంద్ర...ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత బాబుపై దాడి చేయడమే మావోలు లక్ష్యంగా పెట్టుకొన్నారు. న్యూడిల్లీలో చంద్రబాబు పర్యటన సమయంలో మావోలు రెక్కీ నిర్వహించారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు నిఘా వర్గాలు ఆంద్రప్రదేశ్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాయి.దీంతో ఎపి పోలీసులు బాబుకు మరింత భద్రతను పెంచారు.

ఒడిశా ఎన్ కౌంటర్ తర్వాత బాబుకు భద్రత పెంపు
ఒడిశా ఎన్ కౌంటర్ తర్వాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎపి పోలీసులు భద్రతను పెంచారు.ఎపి రాజధానిలో చంద్రబాబునాయుడు నివాసం ఉండే ప్రాంతానికి భద్రతను మరింత పెంచారు. బాబు నివాసానికి సమీపంలోనే ఉన్న కృష్ణానది పరిసర ప్రాంతాల్లో కూడ నిఘాను పెంచారు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో బందోబస్తును ఎపి పోలీసులు పెంచారు.

అలిపిరిలో బాబుపై మావోల దాడి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాద్యతలు నిర్వహిస్తున్న కాలంలోనే అలిపిరిలో బాబుపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో బాబు ప్రాణపాయం నుండి తప్పించుకొన్నారు. అలిపిరి గుండా బాబు కాన్వాయ్ వెళ్తుండగా మావోలు దాడి చేశారు.అయితే సెకన్ల వ్యవదిలోనే బాబు ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు.దీంతో బాబుకు భద్రతను పెంచారు.

ఢిల్లీలో బాబుపై దాడి సులభం
అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబునాయుడుకు మరింత భద్రతను పెంచారు. ఈ ఘటన తర్వాత 9 ఏళ్ళకు పైగా ఆయన ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. మరో వైపు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ , ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయాయి.అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014 లో బాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఢిల్లీకి చంద్రబాబునాయుడు ఎక్కువగా పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉంది.న్యూడిల్లీలో బాబు బస చేసే ఎపి భవన్ లో బాబుపై దాడి చేయడం మావోలకు సులభమని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ఇప్పటికే మావోలు రెక్కీ నిర్వహించాయని ఢిల్లీ పోలీసులు ఎపి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.

ఎపి భవన్ కు భద్రత లేదు
ఢిల్లీలో చంద్రబాబునాయుడు ఎపి భవన్ లో బస చేస్తుంటారు.అయితే ఈ భవన్ కు సరైన భద్రత లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.చంద్రబాబునాయుడు ఢిల్లీలో పర్యటన షెడ్యూల్ ప్రకారంగా సాగడం లేదని ఢిల్లీ పోలీసులుచెబుతున్నారు. దీని కారణంగా కూడ బాబుకుభద్రత కల్పించడం సవాల్ గా మారిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఎపి భవన్ కు సరైన భద్రత కూడ లేకపోవడంపై ఢిల్లీ పోలీసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల వివిఐపిల రక్షణకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఢిల్లీ పోలీసులు చెబతున్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications