చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్లు కావాలంటే ఇలా చేయండి
ఏపీలో చంద్రబాబు సారధ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛను రూ.వెయ్యి పెంచి మూడునెలల ఎరియర్స్ కలిపి రూ.7వేలు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్లకే సచివాలయ ఉద్యోగులు వచ్చి పింఛను అందజేశారు. కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛను కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అలాగే ఉండిపోయారు. ప్రభుత్వం ఎవరికి పింఛను అందజేస్తోంది? దానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
పింఛను ఎవరికి ఇస్తారంటే
వృద్ధులు, చేతివృత్తులవారు, డ్రమ్మర్లు, హెచ్‌ఐవీ బాధితులు, హిజ్రాలు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, నేత కార్మికులు, వితంతువులకు ఇస్తారు.

ఎవరికి ఎంత పింఛను ఇస్తారంటే
కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నెలకు రూ.10వేలు, పూర్తి వికలాంగులకు నెలకు రూ.15వేలు, వికలాంగులకు నెలకు రూ.6వేలు ( ఇది గతంలో రూ.3వేలుగా ఉండేది.. రూ.6వేలకు పెంచారు), సాధారణ లబ్ధిదారులకు నెలకు రూ.4వేలు ఇస్తారు.
ఆన్‌లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలంటే
అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index ఓపెన్ చేయాలి. అందులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. వివరాలన్నీ భర్తీ చేసిన తర్వాత ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు లాంటివన్నీ ఇవ్వాలి. అడ్రస్, పాస్ పోర్టు సైజ్ ఫొటోగ్రాఫ్ దరఖాస్తుకు జతచేసి సమీప గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఇవ్వాలి. లేదంటే ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు.
పోర్టల్ లోకి వెళ్లిన తర్వాత కంప్యూటర్ తెరపై కుడివైపున ఉన్న లాగిన్ ఎంచుకోవాలి. వివరాలన్నీ పూర్తిచేసి పేరు, పాస్ వర్డ్ ఇవ్వాలి. ఓటీపీపై క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీని అక్కడ నమోదు చేయాలి. తర్వాత దరఖాస్తును పూర్తిచేయాలి. ఇతర వివరాలేమైనా కావాలంటే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో రెండో అంతస్తులో ఉన్న Society for Eradication of Rural Poverty కార్యాలయంలో సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications