రోజూ పళ్లు తోముకుంటున్నారా?
పళ్లు తెల్లగా ఉండటంవల్ల ఏమవుతుందో తెలుసా? ఆత్మవిశ్వాసం రెట్టింపవడంతోపాటు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. అందరిలో హాయిగా నవ్వగలుగుతారు. అందరితో చక్కగా మాట్లాడగలుగుతారు. రోజుకు రెండుసార్లు పళ్లు తోముకుంటున్నా పసుపు రంగులోనే ఉంటున్నాయని కొందరు బాధపడుతుంటారు. ఇలా అవడానికి కారణాలు చాలావున్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం.
కాఫీ, టీ, రెడ్ వైన్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడంవల్ల దంతాలు పసుపు రంగులోకి మారతాయి. ప్రతిరోజు బ్రష్ చేసిన తర్వాత కూడా పసుపు రంగు వచ్చే అవకాశం ఉంది. సోడాలో దంతాల పై పొరను తొలగించే కెమికల్స్ ఉంటాయి. వీటివల్ల మరకలు, రంగు మారడం జరుగుతుంటుంది. పళ్లు పసుపురంగులోకి మారుతున్నట్లయితే వెంటనే సోడా తాగడం మానేయాలి. దీనివల్ల కొంతవరకైనా అవి పసుపు రంగులోకి మారకుండా నిరోధించినవారిమవుతాం.

పొగాకు నమలడం, ధూమపానం చేయడం అనేది మరో కారణం. ఈ అలవాట్లను ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. ప్రతిరోజూ దంతాలను శుభ్రపరచడం మాత్రమే కాదు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. కొన్ని మందులు దంతాల పసుపు రంగుకు కారణమవుతుంటాయి. అధిక రక్తపోటు, కీమోథెరపీ, యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా పళ్లు గారపడతాయి.
కొంతమందికి చిన్నతనం నుంచే పసుపు రంగులోకి మారివుంటాయి. పోషకాహార లోపంవల్ల కూడా ఇలా జరుగుతుంటాయి. దంతాల బయటి పొర సరిగా అభివృద్ధి చెందదు. దంతాల వెనక పుసుపు రంగు డెంటిన్ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దంతాల బయటి పొర అరిగిపోయినప్పుడు పసుపు రంగు డెంటిన్ కనిపించడం ప్రారంభమవుతుంది.












Click it and Unblock the Notifications