Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala News:శబరిమల వెళ్లే వారికి వసతి పై దేవస్థానం కీలక ప్రకటన..!!

శబరిమల లో భక్తుల రద్దీ పెరుగుతోంది. మండల - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంలో రూ.28.3 కోట్లు ఆదాయం రాగా.. ఈ సారి అది రూ.41.64 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో దర్శనం వేళ పోలీసులు ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తున్నారు. ఇక, శబరిమలలో బస కోసం భక్తులకు గదుల బుకింగ్ పై దేవస్థానం కీలక ప్రకటన చేసింది.

నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా, ఈ తొమ్మిది రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంలో రూ.28.3 కోట్లు ఆదాయం రాగా.. ఈ సారి అది రూ.41.64 కోట్లకు పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వండిపెరియార్‌ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్‌లైన్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందుగానే బసకు వీలుగా ఆన్ లైన్ లో గదులను బుక్ చేసుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. ఇందు కోసం కీలక సూచనలు చేసింది.

How to get accommodation in Sabarmila Temple announces new guide lines

శబరిమల గదిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం కోసం ట్రావెన్ కోర్ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. ఇందు కోసం www.onlinetdb.com ని సందర్శించాలని ఆలయ అధికారులు స్పష్టం చేసారు. మొదటిసారి టికెట్ బుక్ చేసుకునేవారు సైన్​ ఇన్​ పై క్లిక్ చేసి.. రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇచ్చిన తరువాత అప్లికేషన్ ఫారమ్ కనిపిస్తుందిని చెప్పారు. అక్కడ శబరిమలలో గదులు అందుబాటులో ఉన్నాయో లేదా సెర్చ్ చేయటం ద్వారా కావాల్సిన డేట్స్ లో భక్తుడి వివరాలు నమోదు చేసుకోవాలని. నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం తో గదులను ఆన్​లైన్​లో సులభంగా బుక్​ చేసుకోవచ్చని దేవస్థానం వెల్లడించింది.

గదిని బుక్ చేసే సమయంలో తగిన చెక్-ఇన్ స్లాట్ రూమ్‌లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇక, గది బుకింగ్ సమయంలో అందించిన ఫొటో, ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు పేర్కొన్నారు. గదిలో ఎంత మంది ఉంటారన్నది బుకింగ్ సమయంలోనే పేర్కొనాలి. అలా కాకుండా.. ఎక్కువ మంది వెళ్తే.. ప్రతి అదనపు వ్యక్తికి డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు. ఈ విధానం అనుసరించటం ద్వారా భక్తులకు బస గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా ఆలయానికి వచ్చిన ప్రతీ భక్తుడు దర్శనం చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+