అప్పట్లో విజయవాడను వరదల నుంచి వంగవీటి రంగ ఎలా కాపాడారో తెలుసా..?
రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా విజయవాడలో కుండపోత వర్షం కురిసింది.విజయవాడ చరిత్రలో ఎప్పుడు చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉదృతిని ఎప్పుడు చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడం మొత్తం కూడా జలమయంగా మారింది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.
రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఆరు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం అందిస్తోన్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

అయితే గతంలో ఇంతకన్నా ఎక్కువగానే వరదలు ముంచెత్తినప్పుడు వంగవీటి రంగ విజయవాడను కాపాడిన సంఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 1980, 1983ల్లో ఇప్పుడు వచ్చిన వరదల కన్నా, ఇంకా ఎక్కువగానే వరదలు విజయవాడను ముంచేశాయి. ఇదే బుడమేరు కారణంగా విజయవాడ నీటిలో మునిగిపోయింది. ఇప్పటి మాదిరిగా ప్రభుత్వం విజయవాడలో ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగేవి. దీంతో సర్కారుకు ఈ వరదల విషయం తెలిసేలోపే వంగవీటి రంగా రంగంలోకి దిగి ప్రజలను కాపాడారని విజయవాడ వాసులు చెబుతున్నారు.
పార్టీలు, నాయకులు.. అన్న తేడా లేకుండా.. అందర్నీ కలుపుకొని ప్రజలను రక్షించారని అప్పటి వరద బాధితులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున లారీలు పెట్టి.. అందర్నీ.. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి తరలించేవారు. అక్కడ చాలకపోతే.. పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో శిబిరాలు ఏర్పాటు చేసి.. అక్కడకు తరలించేవారట రంగ. స్వచ్ఛంద సంస్థలను అలెర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగా.. నడుములోతు నీటిలో నడుస్తూ.. ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారట.విచిత్రం ఏంటంటే.. మనుషులతో పాటు.. వారి వస్తువులను కూడా రంగా సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేసేవారట. ఏ ఒక్కరినీ వదిలి పెట్టేవారు కాదని అప్పటి రోజులను విజయవాడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అంత మేలు చేశారు కాబట్టే ఇప్పటికి వంగవీటి రంగాను విజయవాడ ప్రజలు దేవుడిగా కొలుస్తున్నారు.












Click it and Unblock the Notifications