చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ..: వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల
Bhuma Akhilapriya: వైఎస్ జగన్ హయాంలో ఉన్నత విద్యా వ్యవస్థ- ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొందో తెలియజెప్పే ఉదంతం ఇది. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దామంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పుకొన్నప్పటికీ.. ఉన్నత చదువులు మాత్రం ఆ స్థాయిలో సాగలేదని స్పష్టం చేసే ఘటన ఇది.
ప్రభుత్వ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాల మాట అటుంచితే కనీసం ల్యాబొరేటరీలు కూడా అందుబాటులో ఉండకుండా పోయాయి. అయినప్పటికీ- కెమిస్ట్రీ విద్యార్థులు పైతరగతులకు ఎలా ప్రమోట్ కాగలిగారనేది అర్థం కాని విషయం. ఇది- 2016లో బిహార్ పాఠశాల విద్య పరీక్షల కుంభకోణానికి ఏ మాత్రం తీసిపోదనే అభిప్రాయాలు ఉన్నాయి.

జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల పనితీరు ఎంత అధ్వాన్నంగా తయారయ్యాయనే విషయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం శాసన సభ్యురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కళ్లకు కట్టినట్టు వివరించారు. వన్ ఇండియాకు ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు.
చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ- పైతరగతులకు వెళ్లాలంటే కెమిస్ట్రీ స్టూడెంట్స్‌కు కాలేజీల్లో ల్యాబొరేటరీలు అత్యవసరం. ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణులు కావాలంటే ల్యాబ్స్‌లో ప్రయోగాలు చేసి తీరాల్సిందే. ఆళ్లగడ్డ ప్రభుత్వ కాలేజీలో మాత్రం అలాంటి సౌకర్యమే లేదు. అసలు ల్యాబొరేటరీలే లేవు. అయినా స్టూడెంట్స్ మాత్రం ప్రతి సంవత్సరం ప్రమోట్ అవుతూనే వస్తోన్నారు. ఇదెలా సాధ్యం?..అని ప్రశ్నించారు.
ఆమె సంధించిన ఈ ప్రశ్న- ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దుమారం రేపుతోంది. చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీని మంజూరు చేయించుకున్నానంటూ వైసీపీ మాజీ శాసన సభ్యుడు గొప్పలు చెప్పుకొన్నప్పటికీ ఉపయోగం ఏముందని అఖిలప్రియ ప్రశ్నించారు.
వందేళ్ల కిందట కట్టిన ఓ పాత భవనంలో జూనియర్ కాలేజీ కొనసాగుతోందని, అది కూడా ఓ మహిళ దీన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో కూడా డిగ్రీ కాలేజీ ఉందని ఏదో చెప్పుకోవడానికే తప్ప ఎలాంటి మౌలిక సదుపాయాలను కూడా మాజీ వైసీపీ ఎమ్మెల్యే కల్పించలేకపోయారని అఖిలప్రియ విమర్శించారు.
ఈ కాలేజీకి కొత్త బిల్డింగ్ లేదు. సరైన మౌలిక సదుపాయాలు గానీ, వాష్ రూమ్స్ గానీ లేవు. బోధన సిబ్బంది కాదుకదా కనీసం స్వీపర్ కూడా లేడు. స్టూడెంట్సే తమ తరగతి గదులను తామే శుభ్రం చేసుకుంటారు. వర్షం వస్తే విద్యార్థులు తడిచి ముద్ద కావాల్సిందే. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చూరుకారుతుంటాయి.. అని అఖిలప్రియా వివరించారు.
క్యాంపస్ అంతా కూడా ఓ భూత్ బంగ్లాలా కనిపిస్తుంటుందని ఆమె ఆరోపించారు. అలాంటి పాత భవనంలో స్టూడెంట్స్‌ను చేర్పించడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్‌లాగే తన వద్ద కూడా ఓ రెడ్ బుక్ ఉందని. తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టినవారి పేర్లు వందకు పైగా అందులో ఉన్నాయంటూ గతంలో చేసిన హెచ్చరికలపై అఖిల ప్రియా స్పందించారు.
రాజకీయ కక్షతో, చట్ట విరుద్ధంగా తనపై కేసులు బనాయించిన వాళ్లకే ఈ రెడ్ బుక్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని వాళ్లు ఈ రెడ్ బుక్‌ను చూసి భయపడాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. తమ బిగ్ బాస్‌ను సంతోష పెట్టడానికి చట్టాన్ని ఉల్లంఘించిన వారందరూ శిక్ష తప్పదని పునరుద్ఘాటించారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications