రుణం కోసం గవర్నర్ పేరు వాడతారా : ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం : కేంద్రం సైతం మానిటైజ్ చేస్తుందంటూ..!!

ఏపీ రాష్ట్రాభివృద్ధి ద్వారా రుణం పొందేందుకు ప్రభుత్వం చేసుకొనే ఒప్పందాల్లో గవర్నర్ పేరు ప్రస్తావన పైన హైకోర్టు ఆక్షేపించింది. బ్యాంకులకు తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించకపోతే ఆయా బ్యాంకులు గవర్నర్ కు నోటీసులు ..కేసులు దాఖలు చేయటానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ పైన కేసులు నమోదె చేయటానికి అవకాశం లేకుండా రక్షణ ఉందనే విషయాన్ని గుర్తు చేసింది. గవర్నర్‌కు ఉన్న సార్వభౌమాధికారాన్ని ఎలా తీసివేస్తారని హైకోర్టు రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

గవర్నర్ పేరు ఎలా ప్రస్తావిస్తారు

గవర్నర్ పేరు ఎలా ప్రస్తావిస్తారు

ఒప్పందంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరును వ్యక్తిగతంగా ఎలా చేరుస్తారని ప్రశ్నించింది. ఎప్పుడూ ఆయనే గవర్నర్ గా ఉండరు కదా అంటూ వ్యాఖ్యానించింది. ఒప్పందంలో గవర్నర్ పేరు చేర్చటం పైన హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులివ్వడంపై తగిన నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్లకు స్పష్టం చేసింది. ఏపీఎస్డీసీ రుణ వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలతో పాటు అనుబంధ పిటిషన్లపై తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిధులు బదిలీపై కోర్టులో పిటీషన్లు

నిధులు బదిలీపై కోర్టులో పిటీషన్లు

తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని సంచిత నిధిలో జమచేయకుండా నేరుగా ఏపీఎస్డీసీకి బదిలీ చేయడానికి వీలు కల్పిస్తున్న ఏపీఎస్డీసీ చట్టంలోని సెక్షన్‌ 12(1)(4)(5)ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు పిల్ పైన విచారణ జరిగింది. అలాగే ప్రభుత్వ ఆస్తులను, భవనాలను తనఖా పెట్టి రుణం పొందేందుకు ఏపీఎస్డీసి చట్టబద్ధ హోదా కల్పిస్తున్న చట్టంలోని 3(3),4 సెక్షన్లను రాజ్యాంగవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ విజయవాడకు చెందిన కె.హిమబిందు మరో పిల్‌ వేశారు.

రాజకీయ దురుద్దేశంతో వేసిన పిల్ అంటూ

రాజకీయ దురుద్దేశంతో వేసిన పిల్ అంటూ

ఏపీఎస్డీసీ తీసుకునే రుణాలు చెల్లింపు విషయమై 2020 నవంబరు 5న చేసుకున్న ఎస్ర్కో ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ తెనాలికి చెందిన ఎం.వెంకట గ్రీష్మకుమార్‌ ఇంకో పిల్‌ వేశారు. రాజ్యాంగంలోని అధికరణ 361 గవర్నర్‌కు సార్వభౌమాధికారం కల్పించిందన్నారు 'రుణాలు తిరిగి చెల్లించని పక్షంలో వాటిని రాబట్టుకునేందుకు గవర్నర్‌పై కేసులు పెట్టే అధికారాన్ని ఆర్ధిక సంస్థలకు ప్రభుత్వం కల్పించిందంటూ ఎమ్మెల్యే వెలగపూడి తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

Recommended Video

    Palamuru-Rangareddy Project:NGT లో బలంగా వాదనలు AP VS TS Govt | Irrigation Projects| Oneindia Telugu
    కేంద్రం సైతం మానిటైజేషన్ చేస్తోందని

    కేంద్రం సైతం మానిటైజేషన్ చేస్తోందని

    ఎస్డీసీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జీవో ఇచ్చిందని.. దానిని సవాల్‌ చేస్తూ ఏడాది తర్వాత పిల్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. బ్యాంకులకు పిటీషనర్లు రాస్తున్న లేఖల కారణంగా రాష్ట్రానికి రుణాలిచ్చేందుకు ముందుకు రావటం లేదని చెప్పుకొచ్చారు. ఈ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని సంచిత నిధిలో కాకుండా నేరుగా ఏపీఎస్డీసీకి జమ చేస్తున్నామన్న పిటిషనర్‌ వాదనలో నిజం లేదని కోర్టుకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్దిక వనరుల కోసం మానిటైజ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పిటీషనర్ టీడీపీ ఎమ్మెల్యే అని చెబుతూ.. రాజకీయ కారణాలతో వేసిన పిటీషన్ ను కొట్టి వేయాలని కోర్టను కోరారు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని..అప్పటి వరకు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని దవే న్యాయస్థానాన్ని కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+