• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరిలో జగన్ ప్రయోగాలు-వైసీపీ టికెట్ కు ముక్కోణపు పోరు-ఇక ఏం జరిగినా లోకేష్ హ్యాపీ !

|
Google Oneindia TeluguNews

మంగళగిరి : ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. దీనికి కారణం అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ఇక్కడి నుంచే దిగారు. ఆయన్ను ఓడించేందుకు వైసీపీ అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. దీంతో లోకేష్ కు తొలిసారే చేదు అనుభవం తప్పలేదు. కానీ మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్న లోకేష్ ను ఈసారి అడ్డుకునేందుకు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

మంగళగిరిలో ఏం జరుగుతోంది ?

మంగళగిరిలో ఏం జరుగుతోంది ?

గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై ఇప్పుడే క్లారిటీ ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్.. తాను మరోసారి బరిలోకి దిగుతున్నట్లు సంకేతాలు ఇచ్చేస్తున్నారు. మంగళగిరిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇప్పటినుంచే గెలుపుకు బాట వేసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ తరఫున అభ్యర్ధి ఎవరో ఇంకా తేలలేదు. ప్రస్తుతానికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేకు మరోసారి అవకాశం దక్కుతుందో లేదో తెలియడం లేదు. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న బీసీల్ని ఆకట్టుకోవడానికి గతంలో టీడీపీ నుంచి మురుగుడు హనుమంతరావును తెచ్చి ఎమ్మెల్సీని చేసిన జగన్ ను ఆయన నిరాశపర్చారు. దీంతో టీడీపీ నుంచే మరో నేత గంజి చిరంజీవిని తాజాగా వైసీపీ కండువా కప్పేశారు. అయితే గంజి రాకతో సమీకరణాలన్నీ మారబోతున్నాయి.

 గంజి చేరికతో వైసీపీలో..

గంజి చేరికతో వైసీపీలో..


టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ నేత ఆర్కే చేతిలో ఓటమిపాలైన గంజి చిరంజీవికి 2019లో మాత్రం టీడీపీ టికెట్ దక్కలేదు. దీనికి కారణం టీడీపీ అభ్యర్ధిగా నారా లోకేష్ పోటీయే. అయితే లోకేష్ కూడా ఆర్కే చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో ఆళ్ల అక్కడ బలం పెంచుకుంటున్న తరుణంలో అమరావతి ఉద్యమం ఆయన్ను దెబ్బతీసింది. అదే సమయంలో స్ధానికంగా ఆయనపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. చివరికి ఆర్కేను మరో నియోజకవర్గానికి పంపి బీసీ నేతకు టికెట్ ఇద్దామని జగన్ ఆలోచించే వరకూ వెళ్లింది. దీంతో తాజాగా వైసీపీలో చేరిన గంజి చిరంజీవిని లోకేష్ కు పోటీగా ఇక్కడి నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నారు.

గంజి వర్సెస్ ఆర్కే పోరు

గంజి వర్సెస్ ఆర్కే పోరు

గంజి చిరంజీవి రాకతో ముందుగా షాక్ తగలింది సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డికే. వరుసగా రెండుసార్లు మంగళగిరి నుంచి గెలిచి హ్యాట్రిక్ పై దృష్టిపెట్టిన ఆయనకు తాజాగా పార్టీలో చేరిన మాజీ టీడీపీ నేత గంజి చిరంజీవి అడ్డంకిగా మారారు. అంతే కాదు జగన్ సమక్షంలో వైసీపీలో చేరి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి బయటికి రాగానే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసేది తానేనంటూ గంజి ప్రకటించేశారు. దీంతో ఆ తర్వాత ఆర్కే సైతం అదే ప్రకటన చేశారు. మంగళగిరిలో మరోసారి బరిలోకి దిగుతానని, లోకేష్ ను ఈసారి 15 వేల మెజార్టీతో ఓడిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో గంజి, ఆర్కే మధ్య టికెట్ పోరు సీఎం క్యాంపు ఆఫీసు సాక్షిగా బయటపడింది.

ఏం జరిగినా లోకేష్ హ్యాపీ ?

ఏం జరిగినా లోకేష్ హ్యాపీ ?

మంగళగిరి వైసీపీలో తాజాగా మారుతున్న సమీకరణాలు నారా లోకేష్ కు సంతోషం కలిగిస్తున్నాయి. దీనికి కారణం గత ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పటికీ మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవడంలో విఫలమైన లోకేష్.. ఈసారి మాత్రం అక్కడ ఖాతా తెరవాలని భావిస్తున్నారు. అదే సమయంలో మంగళగిరిలో హ్యాట్రిక్ గెలుపు కోసం వైసీపీ చేస్తున్న ప్రయోగాలు ఆయనకు వరంగా మారబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తనపై పోటీ కోసం తొలుత మురుగుడు హనుమంతరావును, ఆ తర్వాత గంజి చిరంజీని తెచ్చి పెట్టుకున్న జగన్ కు వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకునే లోపే ఆర్కే రూపంలో వ్యతిరేకత వస్తోంది. దీంతో అక్కడ వైసీపీ టికెట్ కోసం ముక్కోణపు పోరు తప్పేలా లేదు. ఇప్పటికే మంగళగిరిలో బీసీలకు జగన్ టికెట్ ఇస్తారన్న అంచనాలతో మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి, కాండ్రు కమల పోటీ పడుతుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే మాత్రం తనదే టికెట్ అంటున్నారు. ఈ పరిణామాలన్నీ సహజంగానే లోకేష్ కు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి.

English summary
ganji chiranjeevi's joining into ysrcp causes triangle fight in mangalagiri in 2024 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X