జంగారెడ్డి గూడెం మరణాలు: ఉన్నత స్థాయి సమీక్ష చేసిన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో గత మూడు రోజులుగా వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో సంభవించిన మరణాలు కల్తీ సారా తాగడం వల్ల సంభవించిన మరణాలు అని తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక టీడీపీ వ్యాఖ్యలపై ఎదురు దాడి చేస్తూనే ఘటనకు గల కారణాలపై వైసీపీ సర్కార్ విచారణ జరుపుతుంది.

జంగారెడ్డి గూడెం మరణాలు, వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ

జంగారెడ్డి గూడెం మరణాలు, వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ


జంగారెడ్డి గూడెం లో గత కొద్ది రోజులుగా వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా మృతి చెందుతున్నారో అర్థంకాని పరిస్థితి జంగారెడ్డిగూడెంలో నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పడుకునే వారు తెల్లవారి లేచేసరికి విగత జీవులుగా మారుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి వరుస మరణాలకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జంగారెడ్డిగూడెం మరణాలు సంభవిస్తున్నాయని మండిపడుతున్నాయి. కల్తీ సారా తాగి జంగారెడ్డిగూడెంలో ప్రజలు మరణిస్తున్నారని, ఈ మరణాలకు నైతిక బాధ్యత ప్రభుత్వానిదే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 జంగారెడ్డి గూడెం మరణాలపై డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని ఉన్నతస్థాయి సమీక్ష

జంగారెడ్డి గూడెం మరణాలపై డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని ఉన్నతస్థాయి సమీక్ష


ఇదిలా ఉంటే జంగారెడ్డి గూడెం లో చోటుచేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ మరణాల ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తో సమావేశమైన ఆయన అధికారులను అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై వివరాలు అడిగారు. ఆపై జంగారెడ్డిగూడెంకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ లతోపాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

టీడీపీ ఇలాంటి ఘటనల కోసమే వెతుక్కుంటుంది: పేర్ని నాని

టీడీపీ ఇలాంటి ఘటనల కోసమే వెతుక్కుంటుంది: పేర్ని నాని


ఇక తాజాగా టిడిపి జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలను కూడా రాజకీయం చేస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాలపై కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి పేర్ని నాని ఈ వ్యవహారంపై కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి పేర్ని నాని ఆదేశాలు జారీ చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై రాజకీయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ పై నిప్పులు చెరిగిన మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా చంద్రబాబు నాయుడు వెతుక్కుంటారు అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి శవరాజకీయాలు చేయుట అలవాటైపోయింది అని మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఈ ఘటన పై ప్రాథమిక విచారణ జరిగిందని, ఈరోజు మరలా రెండు మరణాలు సంభవించినట్లు గా మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+