TTD: పోటెత్తిన భక్తులు, క్యూ కట్టిన వీఐపీలు - టీటీడీ కీలక నిర్ణయం..!!

Tirumala: వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీఐపీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అంచనాలకు మంచి భక్తులు తరలి వస్తుండటంలో టోకెన్లు లేని వారిని క్యూ లైన్లలోకి టీటీడీ అధికారులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెన్స్ నుంచి నారాయణ తీర్ధం వరకు భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రముఖులకు వసతి కల్పించటం అధికారులకు సమస్యగా మారుతోంది.

భక్తుల రద్దీ:తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను అధికారులు క్యూలైన్లలోకి అనుమతించటం లేదు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రెండు కిలో మీటర్ల మేర క్యూ లైన్ చేరుకుంది. దీంతో, వైకుంఠ ద్వారా దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి టోకెన్ లేని వారిని దర్శనానికి అధికారులు నిరాకరించారు. ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్నవారికి ఈ అర్దరాత్రి దర్శనం అయ్యే అవకాశం ఉంది. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలో పంపాలని అధికారులు నిర్ణయించారు.

Huge Devotees Rush at Tirumala for Vaikunta Dwara Darshanam, VIPs Reaches in Big number

వీఐపీల రాక:ఇక, రేపు వైకుంఠ ద్వారా దర్శనం కోసం దేశ వ్యాప్తంగా ప్రముఖులు తిరుమలకు తరలి వస్తున్నారు. అయిదుగురు సుప్రీం న్యాయమూర్తులో పాటుగా..వివిధ హైకోర్టుల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. 12 మంది మంత్రులు, స్పీకర్ తిరుమలకు చేరుకుంటున్నారు. 11 మంది పాలక మండలి సభ్యులు తిరుమలలోనే మకాం వేసారు. ఇక, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తిరుమలకు వస్తున్నారు. మరి కొందరు వీఐపీలు వస్తుండటంతో వీరికి వసతి కల్పించటం టీటీడీ అధికారులకు సమస్యగా మారుతోంది. మరో వైపు భక్తుల రద్దీ పెరుగుతోంది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఇస్తున్న ఆఫ్ లైన్ టికెట్ల నిర్ణీత సమాయానికి ముందే ప్రారంభించారు. పూర్తయ్యే వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 27వ తేదీ సంబంధించిన టికెట్లు జారీ చేస్తున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు:శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకోనున్నది. రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. జనవరి 1 వరకు శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శనం కల్పించనున్నారు. 31 కంపార్టుమెంట్లు నిండిపోవడంతో టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి అధికారులు వదలడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్‌ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. అటు తిరుపతిలో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల వద్ద గురువారం రాత్రి నుంచే భక్తులు నిరీక్షించారు. తొలి రోజున వీఐపీల తాకిడి..భక్తుల రద్దీతో ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం వేళ టీటీడీ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+