మేము సైతం - భారీగా విరాళాలు, ఎవరెంత..!!

ఏపీలో వరద బీభత్సం భారీ నష్టం మిగిల్చింది. ప్రాణ - ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. వరద క్రమేణా తగ్గటంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఏపీ ప్రభుత్వం వదర బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. పారిశ్రామిక, సినీ, ఉద్యోగ, వ్యాపార వర్గాలతో పాటుగా సామాన్యులు కూడా మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం అందిస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు.

విరాళాల వెల్లువ
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పారిశ్రామికవేత్తలు, ఉద్యోగ సంఘాల నాయకులు విరాళాలు ప్రకటించారు. ఏపీఎన్జీవే ఉద్యోగులు సెప్టెంబరు జీతంలో ఒకరోజు మూల వేతనాన్ని సుమారు రూ.120 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను ముఖ్యమంత్రిని కలిసి ఆయా సంఘాల నాయకులు అందజేశారు. బిఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎమ్‌డి బలుసు శ్రీనివాసరావు, రూ.కోటి, సినీ నిర్మాత అశ్వనీదత్‌ రూ.25 లక్షలు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ రూ.25 లక్షలు, నాగార్జున ఎడ్యుకేషనల్‌ సొసైటీ రూ.25 లక్షలు, కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ రూ.25 లక్షలు, ఎల్‌విఆర్‌ అండ్‌ సన్స్‌ క్లబ్‌ రీడింగ్‌ కమిటీ సభ్యులు రూ.25 లక్షలు అందిచారు.

Huge response in donations for the AP Govt to address the needs of flood effected area people

బాధితులకు బాసట
చుక్కపల్లి రమేష్‌ రూ.25 లక్షలు, ఎపి ఫౌల్ట్రీ అసోసియేషన్‌ రూ.25 లక్షలు, ఎంఎస్‌ఎంఇ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన విజయనగరం జిల్లా సమాఖ్య తరపున రూ.10 లక్షలు, గుంటూరు క్లబ్‌ రూ.10 లక్షలు, తెనాలి డబుల్‌ హార్స్‌ రూ.10 లక్షలు, ఐఎఎస్‌ ఆఫీసర్స్‌ వైవ్స్‌ అసోసియేషన్‌ రూ.5 లక్షలు, సిద్ధార్థ వాకర్స్‌ క్లబ్‌ రూ.5 లక్షలు, చిలకమర్రి శ్రీనివాసాచార్యులు రూ.1.50 లక్షలు, టిడిపి మహిళా నాయకులు రాయపాటి శైలజ రూ.5 లక్షలు, ఐ నళినీ ప్రసాద్‌, పొట్లూరి విజరుకుమార్‌, అల్లూరి అచ్యుతరామరాజు, వల్లభనేని రవి రూ.1 లక్ష చొప్పున అందచేసారు.

భారీగా ఆర్దిక సాయం
స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల జీతాన్ని ప్రకటించారు. గుంటూరు లోటస్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధులు రూ.10 లక్షలు విరాళాన్ని మంత్రి లోకేష్‌కు అందించారు. వీరితో పాటు ఏలూరుకు చెందిన ప్రవాస భారతీయులు మేకా వినరుబాబు, సామినేని పవన్‌ రూ.10 లక్షలు, మంగళగిరి సిటీ కేబుల్‌ ఎమ్‌డి రూ.5 లక్షలు అందించారు. పంచాయతీరాజ్‌ జెఎసి ఉద్యోగులు ఒకరోజు బేసిక్‌ వేతనం రూ.14 కోట్లు వరద సహాయ నిధికి అందజేశారు. పవన్‌ కల్యాణ్‌ - రూ. 2 కోట్లు (ఏపీలోని గ్రామ పంచాయితీలకు రూ. 4 కోట్లు), ప్రభాస్‌ - రూ. 2 కోట్లు, చిరంజీవి - రూ. కోటి, రామ్‌చరణ్‌ - రూ.కోటి, అల్లు అర్జున్‌ - రూ. కోటి, అక్కినేని కుటుంబం, గ్రూప్‌ సంస్థలు కలిపి - రూ. కోటి, సాయిదుర్గ తేజ్‌ -రూ.20 లక్షలు, అలీ, జుబేదా దంపతులు - రూ. 6 లక్షలు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+