వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రాలో తెలంగాణ మద్యం అమ్మకాల జోరు.. కృష్ణాజిల్లాలో ఐదు రోజుల్లో 143 కేసులు...

|
Google Oneindia TeluguNews

ఏపీలో మద్యనియంత్రణలో భాగంగా అమ్మకాలను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుమసరిస్తున్న విధానం అక్రమార్కుల పాలిట వరంగా మారుతోంది. ముఖ్యంగా తాజాగా భారీగా పెరిగిన ధరలతో అల్లాడుతున్న ఏపీ మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు తెలంగాణకు చెందిన కొందరు అక్కడి మద్యాన్ని భారీఎత్తున తరలించి సరిహద్దు జిల్లాల్లో అమ్ముకుంటున్నారు. దీంతో నాణ్యమైన బ్రాండ్లను బ్లాక్ అయినా కొని సేవించేందుకు ఇక్కడి మద్యం ప్రియులు ఎగబడుతున్నారు.

మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏపీలో మద్యం దుకాణాలు తెరిచిన ప్రభుత్వం ధరలను 75 శాతం పెంచింది. అయినా విక్రయాలు మరింత పెరిగాయి. అయితే ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబులు ఎగబడ్డారు. చివరికి అక్కడ తక్కువ ధరకే దొరుకుతున్న మద్యం బాటిళ్లను తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఏపీలోని కృష్ణా, గుంటూరుకు తరలించడం మొదలుపెట్టారు. అక్రమంగా వేల కొద్దీ మద్యం బాటిల్స్ కేస్ లను ఇక్కడికి తరలించి అమ్ముకుంటున్నారు. దీంతో తక్కువ ధరకే వారికి క్వాలిటీ బ్రాండ్స్ దొరుకుతున్నట్లయింది.

huge sale in telanganas liquor in andhras krishna district

ఏపీలో ప్రస్తుతం దొరుతుతున్న మద్యం ధరలను ఓసారి తెలంగాణతో పోల్చి చూస్తే క్వార్టర్ బాటిల్ ధర ఏపీలో 350 అయితే తెలంగాణలో 160 మాత్రమే. అంటే 190 రూపాయల వ్యత్యాసం అన్నమాట. దీంతో ఎంచక్కా తెలంగాణలో కొన్న మద్యాన్ని ఇక్కడికి తెచ్చి అమ్మేసుకుంటున్నారు. గత ఐదు రోజుల్లో కృష్ణాజిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి అక్రమాలపైనే 143 కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లాలోనూ దాదాపు ఇదే స్దాయిలో కేసులు నమోదవుతున్నాయి.

English summary
after jagan govt's hike in liquor prices in andhra pradesh, telangana liquor sale in the state has been increased drastically. especially in border districts like guntur, krishna excise department officials seized huge liquor from telangana and lodged cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X