Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

wife video: భార్య నగ్న వీడియో వైరల్ -భర్త ఆత్మహత్య -కృష్ణా జిల్లాలో ఘోరం -పోలీసులు ఏం చేశారంటే..

కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి పట్టునే ఉంటున్నప్పటికీ మహిళలపై హింస, వేధింపులు యధావిధిగా కొనసాగుతున్నాయి. కొవిడ్ విలయకాలంలోనూ కామాంధులు పేట్రేగిపోతున్నారు. ఆంద్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో తాజాగా వెలుగుచూసిన వేధింపుల సంఘటనలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. కృష్ణా జిల్లా వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆ ఘటన వివరాలివి..

స్నానం చేస్తుండగా వీడియో..

స్నానం చేస్తుండగా వీడియో..

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, ఎ.సీతారాంపురానికి చెందిన రమేశ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా ఉండేవారు. అదే గ్రామానికి చెందిన జయబాబు అనే కామాంధుడు మహిళల పట్ల చులకన భావంతో మెలిగేవాడు. రమేశ్ భార్యపై కన్నేసిన జయబాబు.. ఇటీవల ఆమె స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఆ వీడియోను ఊళ్లోని మిగతావాళ్లకు పంపి జయబాబు వికృతానందం పొందాడు..

వీరవల్లి పీఎస్‌లో ఫిర్యాదు..

వీరవల్లి పీఎస్‌లో ఫిర్యాదు..

తన భార్య నగ్న వీడియోలు ఊర్లో వైరల్ అవుతున్నాయన్న విషయం తెలియడంతో రమేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బాధిత కుటుంబం నేరుగా వీరవల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వీడియో వ్యవహారంపై ఈ నెల 18న ఫిర్యాదు చేసినా, దర్యాప్తులో జాప్యం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వీడియో వ్యవహారంలో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించిన జయబాబు.. బాధితురాలి భర్త రమేశ్ ను చంపేస్తానని బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈలోపే బాధితురాలి భర్త రమేశ్ మరింత కుంగిపోయి, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

Recommended Video

    Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Oneindia Telugu
    భర్త మృతదేహంతో ఆందోళన..

    భర్త మృతదేహంతో ఆందోళన..

    మహిళ స్నానం వీడియో ఉదంతంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే బాధితురాలి భర్త రమేశ్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. తన భర్త మరణానికి కారణం జయబాబేనని బాధితురాలు ఆరోపించారు.

    భర్త హఠాన్మరణం వల్ల తన కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని, తన ఇద్దరి పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. తనకు తగిన న్యాయం చేయాలంటూ పోలీసులకు మొర పెట్టుకున్నారు. భర్త మృతదేహంతో గ్రామంలో బైఠాయింపునకు దిగారు. కాగా, నిందితుడు జయబాబును అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+