రివర్స్ విషాద ఘటన: భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య

చిత్తూరు: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని బెరెడ్డిపల్లె మండలం కంచనపల్లెలో జరిగింది. కంచెనపల్లికి చెందిన పెద్దరెడ్డప్ప రెడ్డి కుమారుు మంజునాథ రెడ్డి (37)కి రామకుప్పం మండలం అడవిపాముగానిపల్లెకు చెందిన రామిరెడ్డి కూతురు లలితతో 2004లో పెళ్లి జరిగింది.

ఆ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మంజనాథరెెడ్డి ఉపాధి కోసం బెంగళూరు వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. మంజునాథ రెడ్డి అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని కొంత కాలంగా బెంగళూరు రామ్మూర్తినగర్ పోలీసు స్టేషన్‌లో లలిత ఫిర్యాదు చేసింది.

Husband commits suicide with wife's harassment

భర్తపై కేసు పెట్టించి, బెయిల్ రాకుండా భార్య లలిత, సోదరులు మునిరెడ్డి, జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. దీంతో మంజునాథ రెడ్డి బుధవారం రాత్రి గ్రామానికి దగ్గరలో గల పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య, ఆమె సోదరుల వేధింపుల వల్లనే మంజునాథ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+