క్యాబ్‌లో వెళ్లిన మహిళా టెక్కీ అదృశ్యం, భర్తకు మెసేజ్

కార్తీక్ హార్డ్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. భవ్యశ్రీ చరిత సాఫ్టువేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. గురువార ఉదయం భవ్యశ్రీ చరిత విధులకు వెళ్తున్నానని చెప్పి తన సంస్థ క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భర్త కార్తీక్ ఆమె పని చేసే కంపెనీ వద్దకు వెళ్లి ఆరా తీశారు.
గురువారం ఆమె విధులకు హాజరు కాలేదని ఆమె పని చేసే సంస్థ ఉద్యోగులు తెలిపారు. బంధువులు, స్నేహితుల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం అర్ధరాత్రి కార్తీక్ చైతన్నకేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, గురువారం ఉదయం తాను క్యాబ్‌లో కార్యాలయానికి చేరుకున్నట్లు భవ్యశ్రీ భర్తకు మెసేజ్ పెట్టారు. గంట తర్వాత కార్తీక్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం, సాయంత్రం ప్రయత్నించినా కలవలేదు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించారు.
కాగా, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆమె వెళ్లిపోయిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు భవ్యశ్రీ ఫోన్ నెంబర్ ట్రాకింగ్‌లో పెట్టగా.. చివరిసారి ధూల్‌పేట ప్రాంతంలో ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications