భార్యతో గొడవ పడిన భర్త; ఇంటికి నిప్పంటించి.. ఆపై ఏం చేశాడంటే!!
భార్యాభర్తలు అంటే ఒకరి పై ఒకరికి నమ్మకం ఉండాలి. అంతే గౌరవం కూడా ఉండాలి. ఒకరికి ఒకరు ఆలంబనగా జీవనం సాగించాలి. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే ఆ కాపురంలో కలహాలకు తావుండదు. కానీ ఇటీవల కాలంలో చాలామంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తోంది. చిన్నచిన్న కారణాలకే భార్య భర్తలు గొడవలకు దిగడం, అఘాయిత్యాలకు పాల్పడడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

భార్యతో గొడవ పడిన భర్త
కృష్ణా జిల్లా అవనిగడ్డ పంచాయతీ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే స్థానిక లంకమ్మ మాన్యంలో నివసించే 35 సంవత్సరాల వెంకటేశ్వరరావు భార్యతో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. భార్యతో గొడవపడిన భర్త గొడవలతో విసుగు చెంది క్షణికావేశంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య కుటుంబ సభ్యులు ఇంటి ఆరుబయట పడుకొని ఉండగా, తానొక్కడే ఇంటిలోపల పడుకున్నాడు.అప్పుడప్పుడూ గొడవకు దిగి భర్త తీరు తెలిసిన భార్య వెంకటేశ్వరరావు అఘాయిత్యానికి పాల్పడతాడని ఊహించలేదు.

ఇంట్లో బట్టలకు నిప్పు పెట్టి, ఉరి వేసుకున్న భర్త
ఊహించని విధంగా భర్త వెంకటేశ్వరరావు అర్ధరాత్రి సమయంలో బీరువాలో బట్టలు తీసి బట్టలకు నిప్పు పెట్టి, ఆ తర్వాత అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి లోపల బట్టలకు నిప్పు పెట్టడంతో ఇల్లంతా తగలబడి చివరకు బయట వరకు మంటలు వ్యాపించాయి. బయట పడుకుని నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు భయంతో లేచి లోపల వెంకటేశ్వరావు ఉన్నాడని మంటలు ఆర్పే ప్రయత్నం చేసి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వెంకటేశ్వర రావు మృతి చెంది ఉన్నాడు.

భార్యపై కోపంతో ఇల్లు తగలబెట్టి, ప్రాణాలు తీసుకున్న భర్త
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్ప అఘాయిత్యాలకు పాల్పడడం సమస్యకు పరిష్కారం ఏమాత్రం కాదు. భార్యమీద కోపంతో భార్యతో గొడవపడిన వెంకటేశ్వరరావు తన ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇంటికి నిప్పు పెట్టి కుటుంబానికి నిలువనీడ లేకుండా చేశాడు. భార్యాపిల్లలను నడి రోడ్డు మీద నిలబెట్టాడు. వెంకటేశ్వరరావు క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చింది.












Click it and Unblock the Notifications