భార్యతో రెండు నెలలు కాపురం చేసి పారిపోయాడు

తల్లిదండ్రులు గుర్తుస్తొన్నారంటూ వెళ్లిపోయి తిరిగి రాలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కన్నీరు రాజు, హైదరాబాద్‌లోని అల్మాస్‌గుడా అమ్మాయి లక్ష్మి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు.
ఆల్మాస్‌గుడాలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అయితే, తనకు తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారని, చూసి వస్తానని చెప్పి రాజు ఈ నెల 12వ తే్దీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఆ తర్వాత అతని నుంచి ఏ విధమైన సమాచారం లేదు.
రాజు భార్య ఆందోళనకు గురై అతని కోసం ప్రయత్నాలు చేసింది. అయితే, అతడి ఆచూకీ దొరకకపోవడంతో చివరకు పోలీసులుక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications