కోరిక తీర్చమని భార్యకు బలవంతం, ఉరేసి చంపిన భర్త
హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకోమని ఓ వ్యక్తి వేధిస్తుండటంతో భర్తతో కలిసి ఓ మహిళ ఓ వ్యక్తిని కడతేర్చిన సంఘటన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లంగర్ హౌస్ టిప్పుఖాన్ బ్రిడ్జి కింద గోనెసంచిలో ఓ మృతదేహం బయట పడటం శనివారం స్థానికంగా కలకలం రేపింది. మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో గత నెల 13న అదృశ్యమైన వ్యక్తి అదే రోజు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధఇలోని పి అండ్ టి కాలనీ గుడిసెల్లో హత్యకు గురి కాగా, పోలీసుల దర్యాఫ్తులో శనివారం మృతదేహం వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. మీర్ పేట డైనమిక్ కాలనీలో నివసించే పఠాన్ హాజీవలీ... గత నెల 13న ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 15 మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాఫ్తులో మృతుని సెల్ ఫోన్ కాల్ సిస్ట్ పరిశీలించగా.. నిందితుడు శంకరయ్య ఆ సిమ్ ఉపయోగించినట్లు తేలింది.

శనివారం అతడిని విచారించారు. హజీవలీని హత్య చేసింది తానేనని అతను అంగీకరించాడు. గోనె సంచిలో కట్టి, బ్రిడ్జి దిగువన ఉన్న మృతదేహాన్ని చూపించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హజీవలికి శంకరయ్యతో పరిచయం ఉంది. తరుచూ శంకరయ్య ఇంటికి వస్తుండేవాడు. శంకరయ్య కొంతకాలం క్రితం బండలగూడ పి అండ్ టి కాలనీకి మకాం మార్చాడు.
గుడిసె వేసుకొని నివసించేవాడు. ఇక్కడికి కూడా హజీవలీ వచ్చేవాడు. ఈ క్రమంలో గత నెల 13న శంకరయ్య గుడిసె వద్దకు రాగా హజీవలి కనిపించడంతో ఆగ్రహించిన శంకరయ్య అతని గొంతుకు ఉరిబిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి భార్య సహాయంతో బైక్ పైన పెట్టుకొని బ్రిడ్జి వద్ద పడేశారు. కోరిక తీర్చమని అతను వేధిస్తుండటంతోనే అతనిని దంపతులు హతమార్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications