దారుణం: గర్భవతైన భార్యను హత్య చేసి తగులబెట్టాడు

పోలీసులకథనం మేరకు... కొత్తపేటకు చెందిన ఉమాదేవికి కొందుర్గుకు చెందిన శ్రీనివాస్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమనయంలో కట్నా కానుకలు ఇచ్చారు. అయితే జల్సాలకు అలవాటు పడిన శ్రీనివాస్ భార్యను అదనపు కట్నం కోసం హింసించేవాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ భార్యతో గొడవ పడ్డాడు. ఆమెను బండరాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత బుధవారం ఉదయం కిరోసిన్ పోసి తగులబెట్టాడు. విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
గుంటూరు జిల్లా నరసారావుపేట మండలం కాకాని సమీపంలో ఉన్న ఓ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చి ప్రమాదం జరిగింది. సుమారు ఆరుకోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications