ప్రియుడితో కలిసి వెళ్తున్న భార్యను దారుణంగా చంపేశాడు, పారిపోయిన లవర్

కడప: తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను భర్త దారుణంగా హత్య చేసిన సంఘడన కడప జిల్లాలోని రాయచోటిలోని సంబేపల్లి మండలంలోని దుద్యాలలో చోటు చేసుకుంది. వెంకటరమణకు రాణితో పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కొడుకులు. కుటుంబ పోషణ భారం కావడంతో వెంకటరమణ కొన్నాళ్లకు గల్ఫ్ వెళ్లాడు. ఆ సమయంలో రాణికి నాగేశ్వర రావు అనే వ్యక్తితో పరిచయం, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

 మందలించిన బంధువులు

మందలించిన బంధువులు

ఈ విషయం బంధువులకు తెలియడంతో మందలించారు. ఓ సమయంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లల కోసం భర్త వెంకటరమణ భార్యను తిరిగి తన వద్దకు తెచ్చుకున్నాడు. అయినా ఆమె మాత్రం ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. కొన్ని రోజులకు ఓ కొడుకు చనిపోయాడు. ప్రియుడితో కలిసి తన భార్యనే కొడుకును చంపిందని భర్త అనుమానం. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మరింత పెరిగాయి.

 గల్ఫ్ నుంచి పంపిన డబ్బుకు లెక్కలేదు

గల్ఫ్ నుంచి పంపిన డబ్బుకు లెక్కలేదు

అంతేకాదు, తాను గల్ఫ్ నుంచి పంపించిన డబ్బులను కూడా ఆమె వృథా చేస్తున్నట్లు భర్త గుర్తించాడు. చేసిన అప్పులు తీరలేదు. పలుమార్లు భార్య రాణిని ప్రశ్నించినా సమాధానం లేదు. దీంతో అతను గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. నెల రోజులుగా భార్య కదలికలపై కన్ను వేశాడు. మంగళవారం సాయంత్రం రాణి తన ప్రియుడు నాగేశ్వర రావుతో కలిసి బైక్ పైన వెళ్తుంటే చూశాడు.

ఆగ్రహంతో చంపి, తల వేరు చేశాడు

ఆగ్రహంతో చంపి, తల వేరు చేశాడు

భర్త వెంకటరమణ వారిని వెంబడించాడు. కొంతదూరం వెళ్లాక వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. దీంతో ప్రియుడు నాగేశ్వర రావు.. రాణిని అక్కడే దింపేసి బైక్ పైన పారిపోయాడు. వెంకటరమణ ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు. గొంతుకోసి చంపేశాడు. ఆమె తలను వేరు చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

ప్రాథమికంగా కారణాలు

ప్రాథమికంగా కారణాలు

వివాహేతర సంబంధం, కుటుంబంలో తలెత్తిన తగాదాలే ఈ హత్యకు దారి తీశాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వెంకటరణకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. వెంకటరమణ జైలుకు వెళ్లడం, తల్లి మృతి చెందడంతో వారి కుమారుడు అనాథగా మారాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+