మద్యం మత్తులో అర్ధరాత్రి భార్యను అతికిరాతకంగా చంపిన భర్త
విశాఖపట్నం: మందుకు బానిసైన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన విశాఖ జిల్లా పద్మనాభం మండలం కొత్తకోవాడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తకోవాడ గ్రామానికి చెందిన అమ్మన్న (30)కు విజయనగరం జిల్లా నెల్లమిర్ల మండలం తారిపల్లి గ్రామానికి చెందిన అన్నవరపు వెంకటేశ్వరరావుతో 15 ఏళ్ల క్రితం వివహం జరిగింది. ఇటీవల మద్యానికి బానిసైన వెంకటేశ్వరరావు తరచూ భార్యను వేధిస్తున్నాడు.

దీంతో భర్తతో గొడవపడిన అమ్మన్న బుధవారం పుట్టింటికి వచ్చేసింది. శనివారం అర్ధరాత్రి వెంకటేశ్వరరావు మద్యం సేవించి అత్తారింటికి వచ్చాడు. కుటుంబసభ్యలతో పాటు పడుకున్న వెంకటేశ్వరరావు రాత్రి 2 గంటల సమయంలో నిద్రమత్తులో ఉన్న భార్య అమ్మన్నను కత్తితో విచక్షణారహితంగా గాయపరచి పరారయ్యాడు.
దీంతో అమ్మన్న అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పద్మనాభం పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications