పవన్ కల్యాణ్ కోర్టుకు రావాల్సిందే..!

ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌ సివిల్ కోర్టు షాకిచ్చింది. పవన్ కళ్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పవన్ కల్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం(అక్టోబర్ 14) ఈ పిటిషన్ వేయడం జరిగింది.శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుమాంసంతో చేసిన నెయ్యిని కలిసిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Hyderabad Civil Court has issued summons to Pawan Kalyan

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి.ఇదే సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ తన హోదా మరచి వివాదాస్పద వాఖ్యలు చేశారు. పవన్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్‌లో పవన్‌ మాట్లాడిన వీడియోలు డిలీట్‌ చేయాలని న్యాయవాది ఇమ్మనేని రామారావు తన పిటిషన్‌లో కోరారు. తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. తాజాగా దీనిపై స్పందించిన సిటీ సివిల్ కోర్టు పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇదే సమయంలో తెలంగాణ సీఎస్‌కు సైతం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+