హైదరాబాదులో పేలుళ్లకు ఐసిస్ కుట్ర కేసు: మరొకరి అరెస్ట్
హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర పన్నిన జాఫర్‌ను ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు బృందం) అనంతపురంలో అరెస్టు తీసుకుంది. ఇతను మహ్మద్ యాజ్దానీతో కలిసి భాగ్యనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నాడు.
హైదరాబాద్/అనంతపురం: హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర పన్నిన జాఫర్‌ను ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు బృందం) అనంతపురంలో అరెస్టు తీసుకుంది. ఇతను మహ్మద్ యాజ్దానీతో కలిసి భాగ్యనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నాడు.
మహ్మద్ ఇర్ఫాన్ హైదరాబాద్ మీరాలంమండికి చెందినవాడు. అతనిని అరెస్టు చేసిన అనంతరం మంగళవారం నాడు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇర్ఫాన్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది.

ఐసిస్ ప్రోద్బలంతో ఇర్ఫాన్ హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నినట్లు ఎన్‌ఐఏ అభియోగం. అనంతపురం, నల్గొండ జిల్లా పోచంపల్లి నుంచి ఇర్ఫాన్ పేలుడు పదార్ధాలు సేకరించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. గతేడాది జూన్‌లో ఎన్‌ఐఏ హైదరాబాద్‌లో ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications