నిన్నటిదాకా హైదరాబాద్ లో...ఇప్పుడు రాజమండ్రిలో...చెడ్డీగ్యాంగ్ హల్ చల్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu
  ‘ఖాకీ' సినిమాని తలపించేలా దోపిడీలు! : చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

  తూర్పుగోదావరి: నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌లో హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు రాజమహేంద్రవరంలో హడలెత్తిస్తోంది. వరుస చోరీలతో స్థానికులను బెంబేలెత్తిస్తోంది. చెడ్డీ గ్యాంగ్ చోరీకి తెగబడిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డవడంతో పోలీసులు అప్రమప్తమయ్యారు. అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్లో చోరీకి తెగబడిందేనా లేక ఆ స్పూర్తితో స్థానిక చోరాగ్రేసరులు ఈ విధంగా దోపిడీలకు దిగుతున్నారో తేలాలని పోలీసులు అంటున్నారు.

  రాజమహేంద్రవరంలో జెఎన్ రోడ్డులో ఉన్న సాయిశ్రీ అపార్టుమెంట్‌లోని రెండు ప్లాట్లలో తాళాలు పగులగొట్టి ఈ చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. బీరువాలను బద్దలుగొట్టి నగలు, నగదును ఎత్తుకెళ్లింది. ఈ చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సాయిశ్రీ అపార్టుమెంట్‌లో 8 మందితో కూడిన ముఠా ఈ చోరీలకు పాల్పడిందని, అందులో ఇద్దరు వ్యక్తులు బనీను, డ్రాయర్లు ధరించి లోపలికి వచ్చారని వాచ్‌మెన్ తెలిపారు. తనపై బలవంతంగా మత్తు మందు చల్లారని, తెల్లవారుజాము 5 గంటలకు మెలుకువ వచ్చిందని ఆయన చెప్పారు.

  Hyderabad hulchul till yesterday is now shattered in Rajahmundry

  తాము ఊరెళ్లిన సమయంలో దొంగలు పడి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న నగలు, వెండి, డబ్బును ఎత్తుకుపోయారని ప్లాట్ యజమానురాలు వాపోయింది. వాచ్ మెన్ ఇచ్చిన సమాచారం, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా గాలింపు చేపడుతున్నామని డీఎస్సీ తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, త్వరలో పట్టుకుంటామని ఆయన అన్నారు. పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతుందన్న ప్రచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.


  రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల వారు అప్రమప్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ అడ్డు వచ్చిన వారిపై దాడి చేయడానికి, ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడకపోవచ్చని అందువల్ల జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. తమ దర్యాప్తులో ఇది చెడ్డీ గ్యాంగ్ పనే అని ప్రాధమికంగా తెలిసిందని, అయితే ఈ ముఠా హైదరాబాద్ ముఠా ఒకటేనా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. చెడ్డీ గ్యాంగ్ వంటికి నూనె రాచుకుని, ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించి చోరీలు చేస్తారని తెలిపారు. అపరిచితుల సంచారం పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రకాష్ నగర్ పోలీసు స్టేషన్ సి.ఐ. సూర్యభాస్కరరావు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వారి గురించి తెలపాలన్నా, ఏదైనా సమాచారం తెలిసినా వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్ కు గానీ, లేదా 94407 96582 ఫోన్ చేయాలని ఆయన కోరారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The cheddi gang of Hyderabad hulchul till yesterday is now shattered in Rajahmundry. The police were alarmed after the scenes recorded on cc cameras of this cheddi gang .The gang were broken two locks in the Saisree Apartment on the JN Road in Rajahmundry. Eye witness watchmen said A gang of eight people in the Saireei apartments had been involved in the scene, in which two people wearing buniyans and drawers.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి