వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు: కెసిఆర్ ఖుషీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు దేశంలోని ఇతర మెట్రో రైలు నిర్మాణ పనుల రికార్డులను అధిగమించింది. కేవలం 20 నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో 27 కిమీ పొడవున 1000 వయోడక్ట్‌లను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. మెట్రో రైలు పనుల తీరు పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆనందం వ్యక్తం చేశారు.

ముంబై మెట్రో రైలు నిర్మాణ పనుల్లో 11 కిమీ పనులను పూర్తి చేయడానికి ఏడేళ్లు, బెంగళూరు, చెన్నై మెట్రో రైలు నిర్మాణ పనుల్లో 25 కిమీ పూర్తి చేయడానికి ఐదేళ్లు పట్టిందని చెప్పారు. అయితే హైదరాబాద్ మెట్రో రైలు పనుల్లో 27 కిమీ పరిధిలో వెయ్యి వయోడక్ట్‌లను కేవలం 20 నెలల వ్యవధిలో పూర్తి చేసినట్టు ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. తమది దేశంలోని ఇతర మెట్రో రైలు పనులతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో రైలు పనులు రికార్డులను బద్ధలు కొట్టినట్టుగా చెప్పారు.

Hyderabad metro works create record

హబ్సీగూడ జన్‌పాక్ట్ సమీపంలో 2012లో తొలి వయోడక్ట్‌ను ఏర్పాటు చేయగా, 1000వ వయోడక్ట్‌ను ఆదివారం ఎస్‌ఆర్ నగర్‌లో బిగించినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1473 పునాదులను (56శాతం), 1370 స్తంభాలను (52శాతం) పనులు పూర్తి చేసినట్టు తెలిపారు.

మెట్రో రైలు పనులకుగాను ఉప్పల్‌లో 70 ఎకరాల విస్తీర్ణంలో, కుత్బుల్లాపూర్‌లో 62 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ఫ్రీకాస్ట్ యార్డులు ఏర్పాటు చేసినట్టు ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. నిర్మాణ పనుల్లో ముఖ్యమైన వయోడక్ట్‌లను (ఒకొక్కటీ 40 టన్నులు) బరువైన వాటిని ఫ్రీకాస్ట్ యార్డుల్లో తయారు చేసి పాదచారులకు, వాహనదారులకు అసౌకర్య కలగకుండా రాత్రి వేళల్లో ట్రాక్‌పైకి బిగిస్తోన్నట్టు ఆయన తెలిపారు.

నిర్మాణ పనుల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతంలో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను హైదరాబాద్ మెట్రో రైలు దక్కించుకుందని తెలిపారు. ‘ది గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్- 2013' అవార్డుతోపాటు, రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఆక్సిడెంట్స్ అవార్డ్స్ 2013, 2014 అవార్డులు కూడా తమకు వచ్చినట్టు ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండి విబి గాడ్గిల్ చెప్పారు.

English summary
Hyderabad metro rail works are creating records. Telangana CM K Chandrasekhar Rao is happy at the works progressing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X