వైసీపీ ఎంపీకి బురిడీ యత్నం-సీఎంవో పేరుతో ఫోన్ కాల్- చివరికి ఏమైందంటే ?

ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఘటన తాజాగా మరొకటి చోటు చేసుకుంది. గతంలో పలువురు వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల్ని నిధుల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించిన ఆగంతకులు.. ఈసారి తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనకు ఏకంగా ఏపీ సీఎంవో పేరుతో ఫోన్ కాల్ కూడా చేసారు. చివరికి కథ అంతా అడ్డం తిరగడంతో బుక్కయ్యారు.

 ఎంపీ గురుమూర్తిని మోసం చేసే యత్నం

ఎంపీ గురుమూర్తిని మోసం చేసే యత్నం

తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తిని లక్ష్యంగా చేసుకుని మోసం చేసేందుకు జరిగిన ప్రయత్నం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిధుల కోసం ప్రజాప్రతినిధులు చేసే ప్రయత్నాలను తెలుసుకుని, వాటిని ఎలాగైనా ఇప్పిస్తామంటూ రంగంలోకి దిగడమే కాకుండా వారిని ప్రభుత్వ పెద్దల పేరుతో బెదిరింపు కాల్స్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నించడం, అవి కాస్తా విఫలం కావడం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇదే తరహాలో చేసేందుకు ప్రయత్నించిన మరో మోసం చివరి నిమిషంలో ఎంపీ అప్రమత్తతతో తప్పిపోయింది.

 అసలేం జరిగిందంటే ?

అసలేం జరిగిందంటే ?

గత శుక్రవారం తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఏపీ సీఎంవో(ముఖ్యమంత్రి కార్యాలయం) నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కాల్ చేశారు. తన పేరు అభిషేక్ అని, ఏపీ సీఎంవోలో పరిశ్రమల విభాగం చూస్తున్నానని చెప్పుకున్నాడు. గ్రామీణ పరిశ్రమల ఏర్పాటు కోసం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి 5 కోట్లు మంజూరయ్యాయని ఎంపీకి తెలిపాడు. మొత్తం 20 మందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున రుణం మంజూరైందని వెల్లడించాడు. అయితే ముందుగా తన ఖాతాకు రూ.1.25 లక్షల చొప్పున జమ చేయాలని కోరాడు. అలా చేస్తే లబ్దిదారుల పేరుతో రూ.25 లక్షల చొప్పున డీడీలు పంపుతామన్నారు.

అప్రమత్తమైన ఎంపీ

అప్రమత్తమైన ఎంపీ

దీంతో అనుమానపడిన ఎంపీ గురుమూర్తి సీఎంవోకు ఫోన్ చేసి వాకబు చేశారు. పరిశ్రమలశాఖలో అభిషేక్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. దీంతో అలాంటి పేరుతో ఎవరు లేరని తేలింది. విషయం నిర్ధారించుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి తన పీఏ హరీష్ సాయంతో తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. నిందితులు హైదరాబాద్ లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులైన అభిషేక్, సహనిందితుడు బాలాజీనాయుడిని అరెస్టు చేశారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు

గతంలోనూ ఇలాంటి ఘటనలు

గతంలోనూ ఏపీ ప్రభుత్వంలో పలువురు ప్రజాప్రతినిధుల్ని నిధుల పేరుతోనే బురిడీ కొట్టించేందుకు పలువురు ప్రయత్నించారు. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులు అడ్డంగా బుక్కయిపోయి డబ్పులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. మరికొందరు అప్రమత్తమై సకాలంలో పోలీసులను సంప్రదించి బయటపడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా ఇప్పటికీ ఇదే తరహా ఘటనలు కొనసాగడం చర్చనీయాంశమవుతోంది. నిందితులు ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారనే దానిపై ప్రభుత్వం ఉన్నతస్ధాయి విచారణ జరిపించాల్సిన అవసరం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+