విశాఖ గీతం వర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం: నగరంలోని రుషికొండ ప్రాంతంలో ఉన్న గీతం యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్ధిని శ్రేయ ప్రసాద్ (19) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన శ్రేయ ప్రసాద్ గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీ హాస్టల్‌లోనే ఉంటోంది. శుక్రవారం తరగతులకు వెళ్లిన ఆమె మధ్యాహ్నాం హాస్టల్‌లోని తన తరగతి గదికి వచ్చేసింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫోన్‌లో మాట్లాడుకుంటూ కన్నీరుపెట్టింది.

ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల మధ్య తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. సాయంత్రం 6 గంటల సమయంలో స్నేహితులు గదిలోకి రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్య సమాచారాన్ని కళాశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications