సాగర్‌లో తేలుతానన్నాడు: హైదరాబాద్ టెక్కీ మిస్

మీడియా కథనాల ప్రకారం - లక్ష్మీనగర్‌లోని బిపిఆర్ పియర్ల్ హైట్స్ అపార్టుమెంటులో నివసించే అభిషేక్ అగర్వాల్ తన బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఇంటికి రాలేదు. అతని భార్య కోమల్ అగర్వాల్ (24) సోమవారం తన మెయిల్స్ చెక్ చేస్తుంటే, భర్త మెయిల్ కనిపించింది.
తన శవాన్ని హుస్సేన్ సాగర్ నుంచి తీయవచ్చునని అతను మెయిల్ పెట్టాడు. దాంతో పోలీసులు హుస్సేన్ సాగర్ నీటిని జల్లెడ పట్టారు. అయితే అతని శవం కనిపించలేదు. తాను బయటకు వెళ్తున్నానని చెప్పి బైక్‌పై టెక్కీ ఇంటి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు
ఆ తర్వాత అతను భార్యకు ఫోన్ చేసి రాత్రికి ఇంటికి వస్తానని చెప్పాడు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచాఫ్ అయినట్లు తెలుస్తోంది. దాంతో భార్య తన భర్తకోసం మిత్రులందరినీ సంప్రదించింది. అయినా అతని జాడ కనిపించలేదు. అభిషేక్, కోమల్ రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అభిషేక్ వ్యవహారంపై పోలీసులకు అంతు చిక్కడం లేదు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications