ఆ కుక్కలే మొరుగుతున్నాయ్: జగన్ వెంటేనని ఎమ్మెల్యే ఎస్ఆర్ఎస్

Subscribe to Oneindia Telugu

కడప: తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుగా కొన్ని దుష్టశక్తులు తాను టీడీపీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

దువ్వూరులో సోమవారం పార్టీ నేత సిద్ధయ్యనాయుడు నివాసంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

I am always with YSRCP, says MLA Raghurami Reddy

వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరడం తన స్వభావానికి పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mydukur YSRCP MLA Raghurami Reddy on Monday said that he is not joining in TDP, always with YSRCP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి